Breaking News

26/06/2019

గూడుకే దిక్కులేదు (కృష్ణా)

మచిలీపట్నం, జూన్ 26  (way2newstv.in): 

జిల్లా వ్యాప్తంగా ఆయా పురపాలక సంఘాల పరిధిలో జీప్లస్‌త్రీ విధానంలో ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వం చేపట్టింది. జిల్లాకు 63,490 ఇళ్ల కేటాయించారు. పెడన పురపాలక సంఘం మినహా అన్నింట్లో పనులు చేపట్టారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. కేటాయింపులో నెలకొన్న సందిగ్ధతతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇళ్ల కేటాయింపు విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆయా ప్రాంతాల లబ్ధిదారులు కోరుతున్నారు.విజయవాడ నగరంతో కలిపి 9 పురపాలక సంఘాల్లో ఇళ్లను మంజూరుచేసి పనుల నిర్వహణ బాధ్యతలను ఏపీ టిడ్కోకు అప్పజెప్పింది. మచిలీపట్నంలోని నిర్మించనున్న 6,400 ఇళ్లకు రూ.444.51 కోట్లు గతంలోనే మంజూరు చేశారు. స్థానిక దేశాయిపేట ప్రాంతంలో 11 ఎకరాలు, మండల పరిధిలోని రుద్రవరంలో సేకరించిన 25 ఎకరాల భూమిలో పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో పనులు చురుగ్గానే సాగుతున్నాయి.జిల్లావ్యాప్తంగా చేపట్టిన జీప్లస్‌త్రీ ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులకు రుణానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి సానుకూలా నిర్ణయం వెలువడుతుందని అంతా భావిస్తున్నారు. 


గూడుకే దిక్కులేదు (కృష్ణా)
లబ్ధిదారులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి విధి విధానాలు వెలువడగానే అందరికీ తెలియజేస్తాం. 960, రుద్రవరంలోని 25 ఎకరాల్లో 3,000పైగా బ్లాకుల నిర్మాణాలు చేపట్టారు. రెండు ప్రాంతాల్లోనూ పనులు చివరిదశకు చేరుకున్నాయి.మచిలీపట్నంతోపాటు విజయవాడ, గుడివాడ, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నూజివీడు, జగ్గయ్యపేట, పెడన, జగ్గయ్యపేట పట్టణాలకు జనాభా ప్రాతిపదికన ఇళ్లు కేటాయించారు. ఇప్పటివరకు మచిలీపట్నం, గుడివాడలో మాత్రమే లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. మచిలీపట్నంలో 6,400కు 4,176 ఇళ్ల కేటాయింపు పూర్తయ్యింది. మిగిలిన వాటికి 25 ఎకరాల స్థలం కావాలని అధికారులు నిర్ణయించి శివగంగ ప్రాంతంలో స్థల సేకరణకు చర్యలు తీసుకున్నారు.గుడివాడలో 11,912 ఇళ్లకు సగం వరకు లబ్ధిదారులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మిగిలిన ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. పెడన పట్టణంలో మాత్రం స్థలసేకరణ సమస్య కారణంగా ఇంతవరకు ప్రారంభం కాలేదు.జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిర్మించే జీప్లస్‌తీ ఇళ్ల నిర్మాణం మూడు విభాగాలుగా నిర్మిస్తున్నారు. 300 చదరపు అడుగులు, 365, 430 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఒక్కో ఇంటికీ ఒక్కో రకంగా లబ్ధిదారుడు తన వాటా చెల్లించాల్సి ఉంటుంది. 300 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుడు తన వాటాగా రూ. 500 చెల్లించాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు అందిస్తుంది. మరో రూ.2.64 లక్షలు బ్యాంకు రుణంగా అందించాలి. అదే 365 చదరపుటడుగుల ఇంటికైతే లబ్ధిదారుడు రూ. 50 వేలు చెల్లించాలి. ప్రభుత్వాలు ఈ ఇంటికీ కూడా రూ.3లక్షల రాయితీ అందిస్తాయి. మరో రూ. 3.15 లక్షలు బ్యాంకు నుంచి రుణం ఇవ్వాలి. అదే 430 చదరపు అడుగుల ఇంటికి అయితే లబ్ధిదారుడు రూ. లక్ష చెల్లించాలి ప్రభుత్వాలు రూ. 3 లక్షలు కాకుండా మరో రూ. 3.65 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇళ్ల కేటాయింపు చేపడతారు. మచిలీపట్నం, గుడివాడల్లో ఇప్పటికే లాటరీ విధానంలో కేటాయించారు. లబ్ధిదారులు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించారు. ఇంతవరకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదు. ఎన్నికల కోడ్‌ కారణంగా మొదట్లో జాప్యం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ రుణాల ప్రక్రియ గురించి అధికారులు పట్టించుకోలేదు.

No comments:

Post a Comment