Breaking News

05/06/2019

ఎండల్లో జోరుగా మద్యం విక్రయాలు


నిజామాబాద్, జూన్ 5, (way2newstv.in)
ఒకవైపు ఎండలు దంచికొడుతుంటే మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బీర్లకు డిమాండ్ పెరిగింది.ఎండ ప్రచండమ వుతుండడంతో భానుడి ప్రతాపం నుండి దాహం తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ చల్లని పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు.మందుప్రియులు మాత్రం దాహాన్ని తీర్చుకోవడానికి ఎక్కువగా చల్లని బీర్లను కొనుగోలుచేస్తున్నారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరందుకున్న బీర్లపై స్పెషల్ స్టోరి.ఒకవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతుంటే మరోవైపు అదే స్థాయిలో బీర్లఅమ్మకాలు కూడా జరుగుతున్నాయి. మండు వేసవిని తట్టుకోవడానికి చల్లని బీరు తాగేందుకు మద్యం ప్రియులు ఎగబడిపోతున్నారు. రోజురోజుకు ఎండలు ముదిరిపోవడంతో వేసవి తాపం తట్టుకోవడానికి బీర్లు తెగ తాగేస్తున్నారు. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాల జోరు పెరిగింది. వేసవి వచ్చిందంటే చాలు బీర్ల అమ్మకాలు, అమాంతం పెరిగిపోతాయి.


ఎండల్లో జోరుగా మద్యం విక్రయాలు
దీంతో మిగతా నెలల్లోకంటే ఎండాకాంలో 30 శాతం అధికంగా బీర్లు అమ్ముడుపోతున్నాయి.ఉమ్మడి జిల్లాలో 131 మద్యం దుకాణాలు, 17 బార్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 95 వైన్సులు, 13బార్లు ఉండగా, కామారెడ్డి జిల్లాలో 38 వైన్సులు, 4 బార్లు ఉన్నాయి. వీటి ద్వారానే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్షాపుల్లోనూ మద్యం అమ్మకాలు జరుగుతున్నా యి. సాధారణంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతను దృష్టి లో ఉంచుకుని చాలామంది బీర్లవైపే మొగ్గుచూపు తున్నారు. దీనికి తోడు ఈసారి ఎన్నికలు రావడం, వివాహాలు, శుభకార్యాలు కూడా వేసవిలోనే ఎక్కువగా ఉంటాయి. ఇక విందులు, వినోదాల పేరుతో మద్యం విక్రయాలు పెరిగాయి. సాయంత్రం కాగానే మంచి వాతావరణం చూసుకొని చల్లని కిక్కు కోసం మందు ప్రియులు బీర్ల కోసం పరుగులు తీస్తున్నారు.నిజామాబాద్,కామారెడ్డి జిల్లాలో గతేడాది వేసవి కంటే ఈ ఏడాది వేసవిలో 5 నెలల్లోనే బీర్ల కేసుల అమ్మకాలు చాలా పెరిగాయి. ఈసారి 30శాతం ఎక్కువగా బీర్లు అమ్ముడుపోయాయి. ఇరు జిల్లాలో గతేడాది 2018 మే వరకు 8,50,752 కేసుల బీర్లను వ్యాపారులు విక్రయించగా, ఈ ఏడాది 2019 మే వరకు 9,21,870 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. అంటే 30శాతం బీర్ల అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జూన్ పూర్త య్యేలోపు మరో 2లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి. ఈ ఐదునెలల కాలంలో కామారెడ్డి లో 4,01,571 కేసుల బీర్లు అమ్ముడు పోగా 147.73 కోట్ల ఆదాయం వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో 5,20,300 కేసుల బీర్లు అమ్ముడు పోగా 153 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రెండు జిల్లాలో బీర్ల అమ్మకాలతో ఐదు నెలల వ్యవధిలోనే సుమారు 300 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.  సాధారణ రోజుల్లో కంటే ప్రతినెలా సుమారు 20 నుంచి 30వేల కేసులు అధికంగా విక్రయిస్తున్నారు. అంటే ప్రతీ ఏడాది ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాల ద్వా రా 700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తోందన్నమాట. ఏప్రిల్లో వేసవి ఎండలు తారాస్థాయికి చేరుకోవడంతో ఉమ్మడి కామారెడ్డి, నిజామాబా ద్ జిల్లాల్లో అమ్మకాలు అదేస్థాయిలో పుంజుకున్నాయి. జూన్ చివరికల్ల బీర్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పగటి పూట 35-20 డిగ్రీల మధ్య ఎండలు కాయగా రాత్రి పూట చల్లదనం కొనసాగింది. మార్చిలో ఎండలు కాస్తా ముదిరాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఎండలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 43నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనాలు ఎండ వేడి మితో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వేసవి ఎండల బాధ నుంచి తటుకునేందుకు మందుబాబులు చల్లని బీరు తాగడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో జనవరి, ఫిబ్రవరిలలో సాధారణంగా ఉన్న బీర్ల అమ్మకాలు మార్చి నుంచి 20 శాతం పెరిగాయి. మొత్తం మీద వేసవి ప్రారంభమైన 3నెలల వ్యవధిలోనే మద్యం ప్రియులు 100 కోట్ల రూపాయల విలువ చేసే బీర్లు తాగేశారు.జూన్ చివరివరకు ఎండలు ఇదే రీతిలో కొనసాగే అవకాశాలుండటంతో వేసవిలో బీర్ల అమ్మకాల విలువ 20 కోట్లకు చేరే అ వకాశంలేకపోలేదు.ఎండ తీవ్రత నుంచి ఉపషమనం పొందేందుకు మందుబాబులు చాలా మంది బీర్లు తాగేందుకు అసక్తి చూపుతున్నారు. మందుబాబులు బీర్ల వైపు మొగ్గు చూపుతుండడంతో వైన్సుల్లోనూ బీర్ల కొరత ఏర్పడుతోంది.బీర్ల కోసం వైన్సులకు వెళ్తే నోస్టాక్ అని వ్యాపారులు చెప్పే పరిస్ధితి ఏర్పడింది.చిల్డ్బీర్లు లేవని గరం బీర్లు ఉన్నాయంటు సమాదానం వస్తుంది. అయితే జిల్లాలో స్ట్రాంగ్ బీర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటిలో నాకౌట్, కింగ్ఫిషర్, బడ్వజైర్, హై వార్ట్స్ 5000 బీర్లు, ఆర్సీ బీర్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. వైన్ కొనుగోలు చేసే వారంతో చల్లని బీర్ల ను ఆశ్రయించడంతో ఈ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.ఇప్పటివరకు అత్యధికంగా నాకౌట్ బీర్లు కొనుగోలు చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు.మరోవైపు ఎక్సైజ్ శాఖ సైతం వేసవిని దృష్టిలో పెట్టుకొని రేషో విధానం ద్వారా మద్యం దుకాణాలకు పరిమితికి మాత్రమే బీర్లను సరఫరా చేస్తోంది. 

No comments:

Post a Comment