Breaking News

05/06/2019

ఆస్పత్రి తో పాటు ఫ్యాన్ తీసుకెళ్లాలి


నిజామాబాద్, జూన్ 5, (way2newstv.in)
తెలంగాణా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి కార్పోరేట్ ఆసుపత్రిలకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. కాని దేవుడు వరమిచ్చిన పూజారి కరునిన్చాలేడనే చందంగా తయారైంది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పెద్దాసుపత్రిలలోని  లోని ప్రసూతి వార్డ్ లు పసిపిల్లలు,తల్లులు కూతకూత ఉడికి పోతున్నారు.ఎందుకలా అక్కడ సమస్య ఏమిటి..ప్రభుత్వ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసిన అధికార సిబ్బంది నిర్లక్యం కారణంగా సర్కార్ దావాఖనల్లో సమస్యలు రాజ్యమేలుతోన్నాయ్ అసలే ఎండాకాలం ప్రసూతి వార్డ్ లో ఫ్యాన్ లేకుండా ఉండటమనే ఎంత నరకమో ఉహించండి నిజామాబాద్,కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే పరిస్థితి. వైద్యం కోసం వచ్చిన రోగులు ఫ్యాన్ లు లేకపోవడంతో ఉక్కపోతతో ఉడికి పోతున్నారు.


ఆస్పత్రి తో పాటు ఫ్యాన్ తీసుకెళ్లాలి
ఆసుపత్రుల్లోని ప్రసూతివార్డ్ లు నరకానికి నకల్లుగా మారాయి.గాలిలేక పిల్లలు,తల్లుల పరిస్థితి దయనీయంగా మారింది.చంటి పిల్లలు ఉక్కపోతను తట్టుకోలేక తల్లడిల్లి పోతున్నారు వెక్కివెక్కి ఏడుస్తున్నారు.ఉమ్మడి నిజామాబాదు జిల్లా లో 45డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వడగాలులు బయపెడుతున్నాయి.ఈ పరిస్థితుల్లో ఆసుపత్రిలలో ఫ్యాన్లు పని చేయక తల్లిబిడ్డలకు గాలి లేక అవస్థలుపడుతున్నారు.అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో రోగుల బందువులే టేబుల్ ఫ్యాన్ లు ఇంటి నుండి తెచ్చుకుంటున్నారు.ఆసుపత్రి అధికారులను నమ్ముకుంటే తమ పిల్లల ప్రాణాలే కాదు తమ ప్రాణాలు సైతం హరి మంటయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు.ఐతే నిజామాబాద్ ఆసుపత్రిలో ఏసీలు కూడా ఉన్నాయి,కాని అవి అలంకరప్రాయంగానే ఉన్నాయి, వాస్తవానికి ప్రసూతి వార్డ్ లో ఫ్యాన్ లు ఉన్న పనిచేయనప్పుడు ఉపయోగించు కోవచ్చనే ఉద్దేశంతో ఏసీల సదుపాయం కల్పించారు, కాని అధికారులు వాటిని కూడా అటూకేక్కించారు.నిజామాబాద్ ,కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలకు రోజు వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు.ఎండాకాలంలో రోగులను మరింత మంచిగా చూసుకోవాల్సిన అధికారులు, ఆసుపత్రులను మరింత సమస్యల వలయంగా మార్చేస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్యాన్ లు ఏసీలు రిపేర్ చేయించాలను కోరుతున్నారు రోగులు వారి తరుపున వచ్చిన బందువులు

No comments:

Post a Comment