Breaking News

01/06/2019

ప్రాజెక్టులపై ప్రక్షాళన షురూ...


విజయవాడ, జూన్ 1, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రక్షాళన మొదలు పెట్టేశారు. దీంతో చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు కొత్త జీవో జారీ చేసింది. దీంతో వివిధ ప్రాజెక్టులు రద్దు కానున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 వరకు అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో ప్రారంభం కాని వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం జీవో కూడా జారీ చేశారు. 


ప్రాజెక్టులపై ప్రక్షాళన షురూ...
దీని ప్రకారం టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైన వాటిలో ప్రాజెక్టు వ్యయం దాని అంచనా విలువలో 25 శాతం కన్నా తక్కువ ఉంటే అవి కూడా నిలిచిపోతాయి. వీటికి మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వపు తాజా నిర్ణయంతో హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ రంగ ఎన్‌సీసీ కంపెనీపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ కంపెనీ ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో రూ.8,707 కోట్ల విలువైన కొత్త ఆర్డర్ల లభించాయి. వీటిల్లో సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. దీంతో కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో భారీగా కుప్పకూలింది. 2016 నవంబర్ 9 నుంచి చూస్తే ఈ షేరు ఇంతలా పడపోవడం ఇదే తొలిసారి. ఎన్ఎస్ఈలో ఎన్‌సీసీ షేరు ధర 16 శాతం నష్టంతో రూ.97.75 వద్ద ముగిసింది. 

No comments:

Post a Comment