Breaking News

29/06/2019

సమాచార శాఖ సేవలు కీలకం


ఏలూరు, జూన్ 29,(way2newstv.in):
ప్రభుత్వ పధకాలపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలో సమాచారశాఖ కీలకపాత్ర పోషించాలని, జిల్లా ఇన్ చార్జి మంత్రి  రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు.  జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ప్రప్రధమంగా ఏలూరుకు వచ్చిన మంత్రికి  శనివారం స్థానిక ఇరిగేషన్ అతిధిగృహంలో సమాచారశాఖ సహాయ సంచాలకులు మనోరంజన్ తో పాటు  సమాచారశాఖ అధికారులు, సిబ్బంది  పుష్పగుచ్చం అందించి అభినందించారు.

సమాచార శాఖ సేవలు కీలకం


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజాని చైతన్య పర్చడంలో మీడియా  నేడు ప్రధానపాత్ర పోషిస్తోందని ఇటువంటి స్ధితిలో ప్రభుత్వానికి  మీడియాకు మధ్య వారధిగా పనిచేయాలని మంత్రి చెప్పారు.  పశ్చిమగోదావరి జిల్లా సమాచారశాఖ అధికారులు, సిబ్బందితో తనకు ఎంతో అనుబంధం వుందని గతంలో కూడా ఇన్ చార్జి మంత్రి గా పని చేసినప్పుడు ఎంతో కష్టపడి మీడియా కవరేజి చేశారని అన్నారు.  భవిష్యత్ లో కూడా  అదేవిధమైన సహకారం అందించాలని బోస్ కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్ ఒ ఆర్ వి ఎస్ రామచంద్రరావు,  సాయిబాబు, కె.సత్యనారాయణ, జిల్లా సమాచర పౌరసంబంధ శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పులి వినాయకబాబు, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment