Breaking News

20/06/2019

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు


అమరావతి జూన్ 20, (way2newstv.in)
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సచివాలయం ఐదో బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రిని అభినందించేందుకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, అభిమానులు తరలివచ్చారు. 


జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు పాసులు మూడు సంవత్సరాలకు ఒకసారి తీసుకునేలా మొదటి ఫైల్పై ఆయన సంతకం చేశారు. మెట్రో నగరాల్లో 350 ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామన్నారు. రవాణా శాఖ కార్యాలయాల్లో కూడా లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కొత్త వాహనాలు కొనుగోలు సమయంలో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఈనెల 13 నుంచి ఫిట్నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటిదాకా 357 బస్సులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఫిట్నెస్ చేయించని వాహనాల వివరాలు ప్రజల ముందు ఉంచుతామని వివరించారు.

No comments:

Post a Comment