Breaking News

20/06/2019

టీడీపీ కి నలుగురు ఎంపీల షాక్


న్యూఢిల్లీ, జూన్ 20, (way2newstv.in)
టీడీపీకి సొంత పార్టీ ఎంపీలు షాకివ్వబోతున్నారా.. కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా.. అంటే అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చెబుతున్నట్లే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీని వీడబోతున్నారట. బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్న నలుగురు ఎంపీలు.. గోడ దూకేందుకు సిద్ధమైనట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహనరావులు గురువారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని కోరనున్నారట. ఈ వ్యవహారంపై సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని సమాచారం అందుతోంది. ఈ నలుగురు ఎంపీలు టీడీపీని వీడితే.. టీడీపీకి ఇద్దరు ఎంపీలే మిగులతారు. 


టీడీపీ కి నలుగురు ఎంపీల షాక్

వారిలో తోట సీతారామలక్ష్మి కూడా బీజేపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారట. ఇక మిగిలేది కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమేనట. అదే జరిగితే రాజ్యసభలో టీడీపీ సభ్యుల సంఖ్య ఒకటికి పరిమితం అవుతుంది. లేక రవీంద్ర కుమార్ కూడా బీజేపీవైపు అడగులు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు జంపింగ్ షాకిస్తారోరని అధిష్ఠానం కలవరపడుతోంది. తాము గేట్లు తెరిస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఏపీ సీఎం వైఎస్ జగన్ సాక్షాత్తూ అసెంబ్లీలో వ్యాఖ్యానించడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. సుమారు 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ ముఖ్య నేతలు చెబుతుండటంతో ఆ జంప్ జిలానీలు ఎవరా? అన్న చర్చ టీడీపీలో మొదలైంది. దీనికి తోడు తాజాగా జరుగుతున్న మరో ప్రచారం ఆ పార్టీని మరింత కలవరపరుస్తోంది. బీజేపీలో చేరాల్సిందిగా తమకు ఆహ్వానం వచ్చిన మాట వాస్తవమేనని కొందరు చెబుతుండగా, ఏ నిర్ణయమైనా పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పే తీసుకంటామని మరికొందరు చెబుతున్నారు. ఈ జాబితాలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన సుజనాచౌదరి, సీఎం రమేశ్ పేర్లు వినిపించడం గమనార్హం. కేంద్రంలో మోదీని గద్దె దించాలని తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో పాటు రాష్ట్రంలోనూ అధికారం కోల్పోయిన చంద్రబాబు షాకివ్వాలని బీజేపీ అధిష్ఠానం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఆ పార్టీ కీలక నేతలకు గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసి వైసీపీకి ప్రత్యామ్నాయంగా మారాలన్నది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ కోవలోనే ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే టీడీపీ కీలక నేతలతో కమలనాథులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికలకు టీడీపీ ఉండదేమో ఏపీ టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు ఆ పార్టీని వీడనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, 2024 నాటికి ఏపీలో టీడీపీ అనే పార్టీ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏవిధంగా అయితే టీడీపీ కనుమరుగైందో, ఏపీలో కూడా అదే పరిస్థితి ఆ పార్టీకి వస్తుందని జోస్యం చెప్పారు. టీడీపీ కెప్టెన్ లేని షిప్ లాంటిదని, తాము డోర్లు ఓపెన్ చేస్తే టీడీపీ అంతా బీజేపీలో ఉంటుందని అన్నారు. బాబు దుష్ప్రచారం చేసి బీజేపీని నాశనం చేశారని

No comments:

Post a Comment