Breaking News

08/06/2019

దేశ వ్యాప్తంగా 597 ఏటీఎంలు మూత: ఆర్బీఐ


న్యూఢిల్లీ జూన్ 8 (way2newstv.in)
దేశ వ్యాప్తంగా గత రెండేళ్లలో 597 ఏటీఎంలు మూతపడినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వెల్లడించింది. 2017 చివరి నాటికి 2,22,300 ఏటీఎంలు ఉండగా.. 2019 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 221703 కి తగ్గాయని తెలిపింది. బెంచ్‌మార్కింగ్ ఇండియాస్ పేమెంట్ సిస్టమ్స్పేరుతో తాజాగా వెలువరించిన ఓ నివేదికలో ఆర్బీఐ ఈ మేరకు పేర్కొంది. చెలామణీలో ఉన్న నగదుతో పోల్చితే ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకుంటున్న నగదు నిష్పత్తి చాలా తక్కువగా ఉందని ఆర్బీఐ తెలిపింది. నగదు రీసైక్లింగ్‌‌ ప్రభావం తక్కువగా ఉందని చెప్పేందుకు ఇదే సూచన అని పేర్కొంది. 


దేశ వ్యాప్తంగా 597 ఏటీఎంలు మూత: ఆర్బీఐ
విత్‌డ్రా చేసుకున్న నగదు చెల్లింపులు జరపడం... తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా మళ్లీ నగదు అందుబాటులోకి రావాలి. దీన్నే నగదు రీసైక్లింగ్‌గా భావిస్తారు. అయితే విత్‌డ్రా చేసుకుంటున్న నగదు మళ్లీ తిరిగి డిపాజిట్ల రూపంలో తిరిగి రాకపోవడం వల్ల నగదు కొరత ఏర్పడుతుంది.కాగా ప్రస్తుతం ఉన్న ఏటీఎంల విషయానికొస్తే చైనా తర్వాత స్థానం భారత్‌దే కావడం గమనార్హం. 2012-2017 మధ్య ఏటీఎం వార్షిక వృద్ధి14 శాతంగా ఉంది. అయితే ఇక్కడి జనాభాతో పోల్చుకుంటే ఏటీఎంల విస్తరణ రేటు తక్కువగానే ఉంది. బెంచ్‌మార్కు గ్రూప్‌లోని అన్ని దేశాల్లోనూ ఏటీఎంల విస్తరణ రేటు బాగానే ఉంది. అయినప్పటికీ ఇక్కడ ఆరేళ్ల కాలంలో ఏటీఎంల లభ్యత రెట్టింపయ్యింది. 2012 నుంచి2017 మధ్య ఒక్కో ఏటీఎం మీద ఆధారపడే వినియోగదారుల సంఖ్య 10832 నుంచి 5919మంది వరకు తగ్గింది.అని ఆర్బీఐ అధ్యయనం వెల్లడించింది.

No comments:

Post a Comment