Breaking News

24/06/2019

ఉగాదికి 25 లక్షల ఇళ్లు


విజయవాడ జూన్ 24 (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గ్రామాలే లక్ష్యంగా, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. 


ఉగాదికి 25 లక్షల ఇళ్లు
ఇందులో కీలక ప్రకటన చేశారు. ఉగాది పండుగ రోజున గ్రామాల్లో మహిళలకు 25 లక్షల ఇంటి పట్టాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇంటి పట్టాల పంపిణీకి అధికారులు సమాయత్తం కావాలని అధికారులను ఆదేశించారు. భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఇంటి పట్టా ఇవ్వడమే కాకుండా వారి స్థలం ఎక్కడ ఉందో స్పష్టంగా చూపించాలని కూడా అధికారులకు తెలియజేశారు. ఉగాది రోజున గ్రామాల్లో సంబరాలు జరగాలని పేర్కొన్నారు

No comments:

Post a Comment