Breaking News

15/05/2019

గణబాబుకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమేనా

విశాఖపట్టణం, మే 15, (way2newstv.in)
ఎన్నికల ఫలితాలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే విశాఖ అర్బన్ జిల్లాలోని పశ్చిమ అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పెతకంశెట్టి గణబాబు జన్మ దినవేడుకలు రావడంతో ముందే ఆయనింట ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి బరిలో దిగిన గణబాబు గెలుస్తారన్న అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో భారీగా అభివృధ్ధి కార్యక్రమాలు చేయడం వల్ల జనం ఆదరించి ఓటు వేశారని పోస్ట్ పోల్ సర్వే తెలియచేసింది. అదే విధంగా టీడీపీ సంక్షేమ పధకాలు కూడా తోడు కావడంతో ఆయన విజయం నల్లేరు మీద నడకేనని అంటున్నారు. దశాబ్దాల తరబడి హామీగా ఉండిపోయిన ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వంటి పనులను ఆయన ప్రారంభించడంతో అపుడే గెలుపు ఖాయమని అనుకున్నారు.


గణబాబుకు మంత్రివర్గంలో బెర్త్ ఖాయమేనా

గణబాబు టీడీపీ రాజకీయల్లో సుదీర్హ్గ అనుభవం ఉన్న నేత. ఆయన తండ్రి కూడా టీడీపీలో జిల్లా స్థాయిలో పెద్ద నాయకుడు. ఎమ్మెల్యెగా, ఎంపీగా పోటీ చేసి గెలిచి రికార్డ్ సృష్టించారు. ఇక గణబాబు 1999 ఎన్నికల్లో తొలిసారిగా అప్పటి పెందుర్తి సీటు నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. తిరిగి 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ పశ్చిమ సీటుకు పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరిన ఆయన మంచి విజయం అందుకున్నారు. ఈసారి కూడా గెలుపు ఖాయమనుకుంటున్నారు కాబట్టి ఆయన ముచ్చటగా మూడవసారి అసెంబ్లీలో అడుగుపెడతారంటున్నారు విశాఖ జిల్లాలో బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన గణబాబుకు మంత్రి కావాలన్న కోరిక చాలా బలంగా ఉంది. అంతకు ముందు ఆ పార్టీలో దాడి వీరభద్రరావు గవర సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతగా ఉండేవారు. ఇపుడు ఆయన వైసీపీలో చేరడంతో సీనియర్ గా గణబాబు ముందు వరసలోకి వచ్చేశారు. దాంతో ఈసారి ఆయన గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం తప్పకుండా మంత్రి పదవి ఖాయమన్న మాట ఆయన జన్మ దిన వేడుకల్లో పెద్ద ఎత్తున వినిపించింది.గణబాబు అర్బన్ జిల్లాపై బాగానే పట్టు సాధించారు. ఆయన నగర రాజకీయాల్లో కూడా ప్రముఖంగా ఉన్నారు. అయితే మరో బలమైన కాపు సామాజికవర్గం నుంచి గంటా శ్రీనివాసరావుకు మంత్రిగా అవకాశం ఇవ్వడంతో గణబాబుని పక్కన పెట్టారు. ఈసారి మాత్రం తమ నేతకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని, కొత్త వారితో మంత్రి కూర్పు ఉంటుందని చెబుతున్నారు. పార్టీ మళ్ళీ గెలిచి తీరుతుందని, ఇకపై మొహమాటాలు లేవని, కష్టపడేవారికి, కొత్తవారికి అవకాశాలు ఇస్తామని సమీక్షా సమావేశంలో చంద్రబాబు చెప్పడాన్ని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. విశాఖ పశ్చిమలో పార్టీని బలంగా తీర్చిదిద్దిన గణబాబుకు అమాత్య యోగం ఉదని ఆయన పుట్టిన రోజున అభిమానులు తేల్చేశారు. ఇక అసలు ఫలితాలు వచ్చాక గణబాబు ఇంట మ‌రెన్ని సంబరాలు జరుగుతాయో చూడాలి.

No comments:

Post a Comment