తిరుమల, మే 23, (way2newstv.in)
సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రంలోను, దేశంలోను సుభిక్షత నెలకొనాలని ఆకాంక్షిస్తూ తిరుమలలోని పార్వేట మండపం వద్ద టిటిడి నిర్వహిస్తున్న కారీరిష్టి యాగశాలను బుధవారం ఉదయం ఆయన సందర్శించారు. మే 14 నుండి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు కారీరిష్ఠి యాగంను టిటిడి శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్న విషయం విదితమే.
కారీరిష్ఠి యాగశాలను సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ
ఇందులో భాగంగా బుధవారం ఉదయం గణపతి హోమం, పర్జన్య హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులు యాగం వైశిష్ఠ్యాని న్యాయమూర్తికి వివరించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు.
No comments:
Post a Comment