Breaking News

18/05/2019

చివరి దశకు టిప్పన్ల డిజిటలైజేషన్

హైద్రాబాద్, మే 17, (way2newstv.in)
ఏ సర్వే నంబర్ ఎక్కడ ఉందో, ఏ భూమి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఉపయోపడే గ్రామ నక్షలు కొన్ని కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 106 గ్రామాలకు చెందిన టిప్పన్లు మాయమయ్యాయి. ఈ విషయమై ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. గత ప్రభుత్వాల హయాంలోనే టిప్పన్లు మాయమయినట్టు అ ధికారులు గుర్తించారు. కనిపించని నక్షల్లో మహానగరంలో కలిసిపోయిన రంగారెడ్డి జి ల్లాకు చెందిన రెవెన్యూ గ్రామాలే ఎక్కువగా ఉన్నాయి.రాష్ట్రంలోని 10,859 రెవెన్యూ గ్రామాలు ఉండగా వీటిలో 10,753 గ్రామాల నక్షలు, టిప్పన్ల డిజిటలైజేషన్ పూర్తికావొచ్చింది. ఈ వివరాలు సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో ఇప్పటికే పొందుపర్చారు. ఈ వివరాలను ప్రజలు సరిచూసుకుని ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు చేసి పరిష్కారం పొందే అవకాశాన్ని కల్పించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో లేని 106 గ్రామాల నక్షలు మాత్రం డిజిటలైజ్ చేయలేకపోయారు. ఈ గ్రామాల్లో భూముల హద్దులకు సంబంధించిన సమస్యలు తలెత్తితే వివాదాలను పరిష్కరించడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది.


చివరి దశకు టిప్పన్ల డిజిటలైజేషన్

స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన ఈ టిప్పన్లు రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే అందుబాటులో లేకుండా పోయాయని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులు తేల్చారు. కబ్జాదారులతో కొందరు అధికారులు కుమ్మక్కై వీటిని మాయం చేశారని తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 35 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన నక్షలు అందుబాటులో లేవని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులు గుర్తించారు. వీటిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా నడిచే రాజేంద్రనగర్, హ యత్‌నగర్, మొయినాబాద్, షాబాద్, కొ త్తూ రు, శంకర్‌పల్లి తదితర రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన నక్షలు ప్రస్తుతం అందుబాటులో లేవు.కోట్లాది రూపాయల విలువ చేసే ఈ రెవెన్యూ గ్రామాల పరిధిలోని భూ ముల నక్షలు రెండు, మూడు దశాబ్దాల క్రిత మే మాయం కావడం వెనక కబ్జాదారుల హస్త ం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అ లాగే మేడ్చల్ జిల్లాలోని 43 గ్రామాల్లో భూ ముల విస్తీర్ణం, యాజమాన్యం గురించి వెల్లడించే సేత్వార్ రికార్డులు కూడా లేవని తెలుస్తోంది. నిజానికి గ్రామ నక్షలు ఆ గ్రామ వీఆర్వో దగ్గర, మండల తహసీల్దార్ కార్యాలయంలో, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ కార్యాలయాల్లో నక్షల నకళ్లు ఉండాలి. కానీ ఇవి ప్రస్తుతం ఏ ఆఫీసులోనూ లేవు.డిజిటలైజేషన్ సందర్భంలో తహసీల్దార్లను ఆయా గ్రామాల నక్షలను పంపాలనిసర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ అధికారులు కోరగా వారు తమ వద్ద లేవని చేతులేత్తేశారు. భూవివాదాలు తలెత్తిన సందర్భంలో బాధితులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ కార్యాలయానికి వచ్చి టిప్పన్ల కోసం దరఖాస్తులు చేస్తే వారికే ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఇప్పుడు ఆ 106 గ్రామాల్లో రీ సర్వే చేసి కొత్త నక్షలు రూపొందించడం తప్ప మరో మార్గం లేదని సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ అధికారులు పేర్కొంటున్నారు.రాష్ట్రంలో పట్టా, 10సీ, ఇనాం, వక్ఫ్, దేవాదాయ, భూదాన్, సీలింగ్, అసైన్డ్, యూఎల్సీ.. తదితర రకాల భూములు ఉన్నాయి. ప్రైవేటు పట్టా భూములకు టిప్పన్లు అం దుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూములకు మాత్రం లేవు. నిజాం హయాంలో కూడా ప్రైవేట్ భూములను మాత్రమే సర్వే చేసి టిప్పన్లు రూపొందించి, మిగతా భూములన్ని ప్రభుత్వ భూములుగానే నిర్ధారించారు. కానీ ఆ భూములను రక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఆ భూములకు హద్దులు, మ్యాపులు నిర్ధారించకపోవడంతో పక్కనే భూములున్న ప్రైవేట్ వ్యక్తులు చాలా వరకు కలిపేసుకున్నారు. ఫలితంగా చాలా చోట్ల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

No comments:

Post a Comment