Breaking News

21/05/2019

గొర్రెల పథకం లబ్దిదారులకు ఉచిత దాణ

హైదరాబాద్, మే 21 ,(way2newstv.com)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గొర్రెల దాణా పంపిణి కార్యక్రమన్ని పశుసంవర్ధక, డెయిరీ మరియు మత్స్యశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ప్రారంభించారు.  సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని  చేర్లగూడెం లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకములోని రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లు పొందిన గొర్రెల కాపరులకు 200 కిలోల సమీకృత దాణ సరఫరా చేయడం జరుగుతుందని అయన వెల్లడించారు.   ఎండా కాలంలో పశు గ్రాసం లభించని రోజులలో ఈ దాణ గొర్రెలకు పెట్టి రక్షించుకోవచ్చని అన్నారు. 



గొర్రెల పథకం లబ్దిదారులకు ఉచిత దాణ 


గొర్రెలను వేసవిలో పశుగ్రాస కొరత నుండి కాపాడుకోవడానికి వివిధ రకాలైన పశుగ్రాసాలను పెంచుకొని వాటిని వృధా కాకుండా చాఫ్ కట్టర్స్ ద్వారా కత్తిరించి గొర్రెలకు మేపాలని సూచించారు. వేసవి కాలంలో గొర్రెలను ఎండ తీవ్రత నుండి రక్షించడానికి ఉదయం,  సాయంత్రం వేళలో మేతకు తోలుకెల్లాలని, చాలినంత స్వచ్చమైన త్రాగు నీరు అందించాలని సూచించారు.   గొర్రెలకు సంవత్సరంలో యివ్వాల్సిన అన్నిరకాల టీకాలు ఉచితంగా ఇస్తామని, మందులు కుడా ఉచితంగా పంపిణి చేస్తామని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి ఫెడరేషన్ మేనెజింగ్ డైరెక్టర్ డా. వి.లక్ష్మారెడ్డి,  డా. కృష్ణ మోహన్,  సంయుక్త సంచాలకులు గారు, డా. రామారావు రాథోడ్, పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

No comments:

Post a Comment