Breaking News

21/05/2019

నీటి విషయంలో గొడవ


మహిళ మృతి
తుగ్గలి మే 21 (way2newstv.in)
నీటిని వాడుకునే విషయంలో సోమవారం జరిగిన గొడవలో మహిళ మృతి చెందింది.వివరాలలోకి వెళ్లగా తుగ్గలి మండల పరిధిలోని కడమకుంట్ల గ్రామానికి చెందిన ఊటకంటి పద్మావతమ్మ (52) వైఫ్ ఆఫ్ ఊటకంటి తమ్మా రెడ్డి సోమవారం రాత్రి మృతి చెందింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కడమకుంట్ల గ్రామం నందు గల గ్రామ పంచాయతీ ఆఫీస్ ఎదురుగా గల నీటి ట్యాంక్ వద్ద ఊటకంటి పద్మావతమ్మ,భర్త ఊటకంటి తమ్మా రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, అదే గ్రామానికి చెందిన నరేష్ (32) తండ్రి పంప రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యుల మధ్య నీటిని వాడుకునే విషయంలో మాటలతో కూడిన గొడవ జరిగింది.



నీటి విషయంలో గొడవ

ఈ మాటల గొడవలో పద్మావతమ్మ భర్త తమ్మారెడ్డి గట్టిగా అరవడం వలన తన భార్య స్పృహ తప్పి పడిపోయింది.చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స మద్యలో ఆమె మృతి చెందినట్లు అక్కడ డాక్టర్లు తెలియజేసారు. అనంతరం కుటుంబ సభ్యులు పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు,అక్కడ డాక్టర్లు ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈమె మృతి పై జొన్నగిరి పోలీస్ స్టేషన్ నందు ఐ.ఆర్ నంబర్ 54/2019, మంగళవారం రోజున కేసు నమోదు చేశారు.ఈమె మృతిపై పోలీసులు విచారణ చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

No comments:

Post a Comment