Breaking News

21/05/2019

స్ట్రీట్ లైట్లపై అందే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్య‌త

హైదరాబద్ మే 21(way2newstv.in

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో వీధి దీపాల నిర్వ‌హ‌ణ‌పై అందే ఫిర్యాదుల ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఎం.దాన‌కిషోర్ స్ప‌ష్టం చేశారు. నేడు జీహెచ్ఎంసీ విద్యుత్ విభాగం ప‌నితీరుపై స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సందీప్‌జా, చీఫ్ ఇంజ‌నీర్ సురేష్‌, ఇ.ఇ.ఎస్‌.ఎల్ ప్ర‌తినిధులు హాజ‌రైన ఈ స‌మావేశంలో క‌మిష‌న‌ర్ దాన‌కిషోర్ మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలో సాంప్ర‌దాయ‌క విద్యుత్ దీపాల స్థానంలో 4,25,357 ఎల్‌.ఇ.డి లైట్ల‌ను అమ‌ర్చ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. ఈ స్ట్రీట్ లైట్ల నిర్వ‌హ‌ణ‌ను స‌మీక్షించ‌డానికి 26,581 సీ.సీ.ఎం.ఎస్ యూనిట్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిపారు.





స్ట్రీట్ లైట్లపై అందే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్య‌త 


ప్ర‌స్తుతం న‌గ‌రంలో సుమారు 97శాతం స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయ‌ని ఇ.ఇ.ఎస్‌.ఎల్ అధికారులు క‌మిష‌న‌ర్‌కు వివ‌రించారు. అయితే ఇ.ఇ.ఎస్‌.ఎల్ ఒప్పందంలో భాగంగా ప్ర‌తిరోజు 98శాతం వీధిదీపాలు వెలగాల్సి ఉంద‌ని, ఈ విష‌యంలో జీహెచ్ఎంసీ ఎల‌క్ట్రిక్ విభాగం అధికారులు, థార్డ్ పార్టీ త‌నిఖీల‌ను నిర్వ‌హించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు. విద్యుత్ దీపాల నిర్వ‌హ‌ణ‌పై వ‌చ్చే ఫిర్యాదుల‌ ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని, ఎల్‌.ఇ.డి ప్రాజెక్ట్ అమ‌లు అయిన తేదీ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 88,315 ఫిర్యాదులు అంద‌గా వీటిలో 87,344 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింద‌ని మ‌రో 944 ఫిర్యాదులు వివిధ కార‌ణాల‌తో పెండింగ్‌లో ఉన్నాయ‌ని వివ‌రించారు. న‌గ‌రంలోని మొత్తం ఎల్‌.ఇ.డి లైట్ల‌లో 3,66,055 స్ట్రీట్ లైట్లు కామ‌న్ డ్యాష్ బోర్డుకు అనుసందానం చేయ‌డం జ‌రిగింద‌ని, వీటి నిర్వ‌హ‌ణ‌పై సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా తెలుసుకునే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు. న‌గ‌రంలోని విద్యుత్ దీపాల‌కు సంబంధించి ఫిర్యాదుల‌పై ఇ.ఇ.ఎస్‌.ఎల్ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ 1800-180-3580 అనే నెంబ‌ర్‌కు ఫోన్ చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు

No comments:

Post a Comment