Breaking News

21/05/2019

ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి


నాగర్ కర్నూల్  మే 21 (way2newstv.in)
లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను సోమవారం నాగర్ కర్నూలు కలెక్టర్ శ్రీధర్ పరిశీలించారు. అయన వెంట జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా స్థాయి  అధికారులు వున్నారు. నెల్లి కొండ మార్కెట్ గోదాము, ఉయ్యాలవాడ వద్ద నున్న మోడల్ బీఈడీ కళాశాల వద్ద ఏర్పాట్లను అయన పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బారికేడింగ్ తో పాటు కౌంటింగ్ కేంద్రం లోపల బారి కోడింగ్, మెష్ తదితర వాటిని ఏర్పాట్లను చుట్టుపక్కల ప్రదేశాలు ఏర్పాట్లను కుడా కలెక్టర్ పరిశీలించారు.  అలాగే రెండు కేంద్రాల వద్ద ఎన్నికల పరిశీలకులకు, రిటర్నింగ్ అధికారికి, జిల్లా ఎన్నికల అథారిటీలకు ప్రత్యేకంగా రూములు ఏర్పాటును స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. అసెంబ్లీ నియోజక వర్గం వారీగా కౌంటింగ్ కేంద్రాలలో పనిచేసే సిబ్బందికి మరియు మీడియా వారికి భోజన సదుపాయాన్ని  ఎక్కడ ఏర్పాటు చేయాలో వివరించారు. భోజన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా   వ్యవసాయ అధికారి బైరెడ్డి సింగారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు.



ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలలో  ఏర్పాట్లు పూర్తి


ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పెద్ద మొత్తంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని, తాగునీటి కౌంటర్లు ఎక్కువగా ఏర్పాటుచేయడంతో పాటు, చల్లని ఐస్ వాటర్ ను ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలని కౌంటింగ్ మొదలైన తర్వాత భద్రతా సిబ్బంది అనుమతించారని త్రాగునీటి అవసరమైన అన్ని ఏర్పాట్లను అత్యంత పక్కాగా ఏర్పాటు చేసుకోవాలని, అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కౌంటింగ్ సిబ్బందికి  తాత్కాలిక పురుష మరియు మహిళ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేయ ప్రదేశాన్ని సైతం పరిశీలించి ఏర్పాటు చేయాలని నాగర్ కర్నూలు మున్సిపల్ కమిషనర్ జయంత్ రెడ్డి ని కలెక్టర్ ఆదేశించారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ అంతరాయం ఉండడంతో పనులకు అంతరాయం ఏర్పడడంతో విద్యుత్ శాఖ అధికారులపై  తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్, ఈ మూడు రోజులపాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను  ఆదేశించారు. ఏఈ స్థాయి విద్యుత్ శాఖ అధికారి లెక్కింపు కేంద్రాల వద్ద 24 గంటలు విద్యుత్ పర్యవేక్షణ విధులు నిర్వహించి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, జనరేటర్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.కౌంటింగ్ కేంద్రంలో విద్యుత్ సాకెట్లు, విద్యుత్ స్విచ్ బోర్డులు, కౌంటింగ్ కేంద్రంలో తీవ్ర వేసవి వేడిమి దృష్ట సిబ్బందికి కూలర్లు అన్ని ఏర్పాట్లను కలెక్టర్ గారు స్వయంగా పరిశీలించారు.ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఎప్పటికప్పుడు గమనించటం తో పాటు, ఫలితాలను ప్రదర్శించేందుకు గాను సీసీ కెమెరాలతోపాటు, టీవీలను, డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని, 2 కౌంటింగ్  కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు తోపాటు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా అధికారులు అనిల్ ప్రకాష్ మరియు అఖిలేష్ రెడ్డి లను ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు ఫలితాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకొని ఏడు నియోజకవర్గాల సమాచారాన్ని క్రోడీకరించి ఎన్నికల పరిశీలకులకు, తన తో పాటు, మీడియా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, కేంద్ర ఎన్నికల కమిషన్కు జాప్యం లేకుండా నివేదికలు పంపించేలా ఏర్పాటు చేయాలని ముఖ్య ప్రణాళిక అధికారి మోహన్ రెడ్డిని ఆదేశించారు.నెల్లి కొండి తో పాటు ఉయ్యాలవాడ బీ ఈడీ కళాశాలలో నీ కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా కేంద్రం ఏర్పాటు చేయనున్న ప్రదేశాన్ని  పరిశీలించి, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కవర్ చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల ద్వారా ఐదుగురు మాత్రమే లోపలికి వెళ్లి కవర్ చేసిన అనంతరం తిరిగి మరో ఐదు మందిని అనుమతించేలా ఏర్పాటు చేయాలని, నెల్లికొండి, ఉయ్యాలవాడ రెండు కేంద్రాల సమాచారాలను సమన్వయం చేసుకొని మీడియా ప్రతినిధులకు పార్లమెంట్ నియోజకవర్గ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని,అలాగే వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని, మీడియా నోడల్ అధికారి అంజిలప్ప మరియు డి పి ఆర్ ఓ వెంకటేశ్వర్ల  ను కలెక్టర్ ఆదేశించారు.పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లలో ఎలాంటి  లోపాలు లేకుండా ఒకటికి రెండుసార్లు  
సరిచేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

No comments:

Post a Comment