Breaking News

17/05/2019

హైద్రాబాద్ ను పొగబెడుతున్నకాలుష్య వాహనాలు

హైద్రాబాద్, మే  17, (way2newstv.in)
డీజిల్ వాహనాలు నగరానికి పొగబెడుతున్నాయి. గ్రేటర్‌లో పెరుగుతున్న కాలుష్యానికి డీజిల్ వాహనాలే ప్రధాన కారణమని పీసీబీ గుర్తించింది. ప్రతిరోజు కొత్తగా వేలాది సంఖ్యలో ఫోర్‌వీలర్ వెహికిల్స్ రోడ్డుపైకి వస్తున్న వాహనాల వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టాలని రవాణాశాఖకు సూచించింది. ఇప్పటికే  కాలుష్యం కాసారంగా మారిన ఢిల్లీలో డీజిల్ వాహనాలపై నిషేధాన్ని అమలుచేశారు. తొలుత మూడు మాసాలపాటు అమలు చేయగా, తదుపరి నిరవధికంగా చేయడానికి సంక్పలించారు. ఏకంగా సుప్రీం కోర్టు కల్పించుకుని ఢిల్లీలో కాలుష్య సమస్య నివారణకు భారీ డీజిల్ వాహనాలపై విధించింది, కానీ హైద్రాబాద్ లో పెరుగుతున్న డీజిల్ వాహానాలపై నియంత్రణపై చర్యలకు ముందుకు తీసుకెళ్లకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంద. నగరంలో తిరుగుతున్న డీజిల్ వాహనాలు పొగబెడుతున్నాయి. కాలుష్యాన్ని మోసుకొచ్చి నగరంపై కుమ్మరిస్తున్నాయి. గ్రేటర్‌లో వాయు కాలుష్యం గణనీయంగా పెరగడానికి డీజిల్ వాహనాల వినియోగం పెరగడమేనని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) గుర్తించింది. ఈ వాహనాల వినియోగం ఇలాగే కొనసాగితే నగరంలో కాలుష్యాన్ని నియంత్రించలేమని తేల్చిచెప్పింది. డీజిల్‌కు ప్రత్యామ్నాంగా సీఎన్‌జీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. 


హైద్రాబాద్ ను పొగబెడుతున్నకాలుష్య వాహనాలు

ప్రస్తుతం గ్రేటర్‌లో 25 లక్షల వాహనాలు తిరుగుతుండగా, 2.5 లక్షల డీజిల్ వాహనాలున్నట్లుగా పీసీబీ గుర్తించింది. రెండేళ్ల నుంచి డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏటా 30 వేల పైచిలుకు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.వాస్తవంగా వాహనాలపై యూరో మార్గదర్శకాలు అమల్లోకి రాకముందు నగరంలో డీజిల్ వాహనాల వినియోగం అంతంతమాత్రమే. 2000 సంవత్సరానికి ముందు గ్రేటర్‌లో కేవలం 48,741 డీజిల్ వాహనాలే వినియోగంలో ఉండగా, తాజా లెక్కల ప్రకారం వాటి సంఖ్య 2,41,817కు చేరింది. కేవలం 15 సంవత్సరాల వ్యవధిలోనే డీజిల్ వాహనాల సంఖ్య 2 లక్షలు పెరగడం గమనార్హం. భారీ వాహనాలైన ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్లను సీఎన్‌జీకి మళ్లించడంపై దృష్టిపెట్టాలని పీసీబీ వర్గాలు కోరుతున్నాయి.గ్రేటర్‌లో వాహనాల పొగతోనే కాలుష్య ప్రభావం అంతకంతకు పెరుగుతోందని పీసీబీ అధికారులు గుర్తించారు. కూడళ్లలో టన్నుల కొద్ది వాహనాల పొగ నమోదవుతోంది.దీనిపై పలుమార్లు అధ్యయనం చేయించిన పీసీబీ అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కాలుష్యం భారీగా పెరగడాన్ని గుర్తించారు. 1992లో నగరంలో 500 టన్నులపొగ వెలువడగా, 2016కు 1500 టన్నులకు చేరింది. నగరంలోని 585 ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నమోదయ్యే కాలుష్యాన్ని నమోదుచేశారు. వీటిలో 125 కూడళ్లలో అత్యధిక కాలుష్యం నమోదవుతోందని, మిగతా 210 కూడళ్లలో కాలుష్య హెచ్చతగ్గులు సాధారణ స్థాయిలోనే ఉన్నట్లుగా తేల్చారు. ప్రధానంగా పంజాగుట్ట, ఎస్సార్‌నగర్, చాదర్‌ఘాట్, లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజేమార్కెట్, మదీనా కూడళ్లలో అత్యధికంగా వాయు కాలుష్యం నమోదవుతోంది. వాహనాల రద్దీ తీవ్రంగా ఉండే ప్రాంతాల్లోనే కాలుష్యం అత్యధికంగా నమోదువుతోంది. 

No comments:

Post a Comment