Breaking News

17/05/2019

పంట కాలనీల ఏర్పాటుకు ప్రణాళికలు

హైద్రాబాద్, మే 17, (way2newstv.in)
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రధాన ఉద్దేశంగా ముందుకెళ్తున్న ప్రభు త్వం పంటకాలనీల వైపు దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌ 15న ప్రారంభమైనటువంటి సాగు సర్వే రైతువారీగా ముమ్మరంగా కొనసాగుతుంది. వ్యవసాయ అధికారులు, ఉద్యాన శాఖ సిబ్బంది సహకారంతో అన్ని గ్రామాల్లోను రైతువారీగా 44 అంశాలను సేకరిస్తు ఈ సర్వే చేపడుతున్నారు.అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఆరాటపడుతూ ఈ శాఖలో అనేక సం స్కరణలు చేపడుతూ మార్కెట్‌లో అవసరాలు, డిమాండ్‌ ఆధా రంగా పంటల ఉత్పత్తి చేపడితే రైతుకు మేలు జరుగుతుందని భావించిన ప్రభుత్వం పంటకాలనీలను ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంది. వాతావరణ పరిస్థితులు, భూముల్లోని సారాన్ని బట్టి పంటలు సాగు చేస్తే మంచి దిగుబడి రావడంతో పాటు రైతుకు ఆర్థ్ధిక వనరులు సైతం పెరిగే అవకాశం ఉంది. తొలుత 39 అంశాలే ఉండగా ఆ తర్వాత మరో 5 అంశాలను ప్రభుత్వం జోడించింది. ప్రతి రైతు ప్రస్తుతం ఏ పంటవేశాడు. దానివిస్తీర్ణం పెట్టుబడి దిగుబడి మార్కెటింగ్‌...మిగులుబడి కోణం లో వివరాలు సేకరిస్తు సర్వే చేపడుతున్నారు. రైతువారీగా చేపట్టే ఈ సర్వేలో రైతు సాగు చేసిన పంట భూమి వివరాలు, వాటిని మార్కెటింగ్‌ చేయడంపై ప్రధాన దృష్టి సారించారు. 


పంట కాలనీల ఏర్పాటుకు ప్రణాళికలు

ఈనెల చివరి వరకు ఈ రైతు వారీ వివరాలను సేకరించి ఎప్పటికప్పు డు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. జిల్లాలోని 140 క్లస్టర్లలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు ఉద్యాన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తీసుకున్న డేటాను ఎప్పటికప్పుడే వారి వద్ద ఉన్నటువంటి ట్యాబ్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇందులోభాగంగానే జిల్లా వ్యాప్తంగా ఈ సాగు సర్వేను గత నెల లో వ్యవసాయ యంత్రాంగం చేపట్టింది. ‘ఆధార్‌ సమాచార వినియోగానికి అంగీకార పత్రం’ పేరుతో ఈ సర్వేలో భాగంగా ప్రతి రైతు నుంచి 44 అంశాలను సేకరిస్తు ఇప్పటివరకు 30 శాతం పూర్తి చేశారు. జిల్లాలో 140 వ్యవసాయ క్లస్టర్లలోని 564 గ్రామాల్లో 4,15, 521 మంది రైతుల నుంచి సాగు వివరాలు సేకరించాల్సి ఉం డగా ఇప్పటి వరకు 1,12,953(27.18 శాతం) మంది రైతుల నుంచి తీసుకున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 31 మండలాల్లో ఇప్పటివరకు అత్యధికంగా కనగల్‌ మండలంలో 52.39శాతం సర్వే పూర్తి కాగా అత్యల్పంగా డిండి 16.26శాతం మాత్రమే సర్వే చేపట్టారు. వాస్తవంగా గత నెల 15నే సర్వే ప్రారంభమైనప్పటికీ తొలి 10 రోజులు పెద్దగా దృష్టి సారించని యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు నివేదించాల్సిన నేపథ్యంలో ఇటీవల ముమ్మ రం చేశారు. పరిషత్‌ ఎన్నికలు ఉండటంతో వచ్చే నెల వరకు గడువు ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను కోరినప్పటికి గడువు ఇవ్వని కారణంగా ఆలోపే పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించి సర్వే చేస్తున్నారు. ప్రతి రోజు 9 వేల నుంచి 12 వేల మంది రైతుల నుంచి డేటా తీసుకునే విధంగా ఏఈవోలు బాధ్యత వహించి ఈ సర్వే చేపడుతున్నారు.  ప్రస్తుతం జిల్లాలో వాణి జ్య పంట అయిన పత్తి అధికంగా సాగవుతుండగా తర్వాత వరి సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న బత్తాయి క్రమంగా వెనుకబడింది. ఇటీవల కూరగాయల సాగు పెరుగుతున్నప్పటికీ మార్కెటింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక పప్పుదినుసులవైపు రైతాంగం ఆలోచనే చేయడం లేదు. ఈ కోణంలో వివరాలు సేకరిస్తున్న అధికార యంత్రాంగం జిల్లా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏ మేరకు అవసరం ఉంటాయి...ఇక్కడ నేలల పరిస్థితి ఏమి టి...ఏ పంట బాగా దిగుబడి వస్తుంది అనే కోణంలో డేటా సేకరిస్తున్నారు. ఈ సర్వే అనంతరం సర్కార్‌ సూచన మేరకు మండలాల వారిగా, లేదంటే క్లస్టర్ల వారిగా పంట కాలనీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో యంత్రాంగం ఉంది. అదే విధంగా పండించినటువంటి పంటలకు అనుగుణంగా రైతుకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో ప్రాసెసింగ్‌ యూనిట్లను సైతం సర్కార్‌ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. పత్తి పండిస్తే జిన్నింగ్‌ మిల్లులు...వరి పండిస్తే రైస్‌ మిల్లులు అవసరం. ఇక బత్తాయి నిమ్మతోపాటు పప్పు దినుసులకు ప్రత్యేక ప్రాసెసింగ్‌ యూనిట్లు కావల్సి ఉంది. పండ్లు, మిర్చికి కోల్డు స్టోరేజీలు అవసరమని యోచించి వ్యవసాయ, ఉద్యాన, ఐకేపీ, పరిశ్రమలు, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పి దిగ్విజయంగా నడిపించాలని ప్రణాళికలు రూపొందించి ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పి మార్కెటింగ్‌ శాఖ ఆద్వర్యంలో ప్రాసెస్‌ అయినటువంటి ఉత్పత్తులను విక్రయించే చర్యలు తీసుకోనుంది.

No comments:

Post a Comment