Breaking News

17/05/2019

పాములపాడు లో గాలివాన బీభత్సం

నిలిచిపోయిన విద్యుత్ సరఫరా     
చెలిమిళ్ళ గ్రామంలో పిడుగుపాటు       
పాములపాడు మే 17 (way2newstv.in)
పాములపాడు మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో గాలివాన బీభత్సం సృష్టించింది పాములపాడు మండల కేంద్రంలో చిన్న చిన్న రేకుల షెడ్లు గాలి తీవ్రతకు పైకి ఎగిసాయి అలాగే చెలిమిళ్ళ గ్రామం లోని పొలాలలో   పిడుగు పడింది పొలాల్లో ఎవరు లేక పోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు 


పాములపాడు లో గాలివాన బీభత్సం   

మండల కేంద్రంలో దాదాపు విద్యుత్ సరఫరా ఎనిమిది గంటలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు చిన్న చిన్న గాలివానలకు ఇలా గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేయడాన్ని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముందస్తు  చర్యలు తీసుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం విద్యుత్ శాఖకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు

No comments:

Post a Comment