Breaking News

18/05/2019

నీటి వాడకాలపై తేలని లెక్కలు

టెలీమెట్రీపై మీన మేషాలు
నల్గొండ, మే 18, (way2newstv.in)
టెలీమెట్రీ’ పరికరాల ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు కృష్ణా నది నిర్వహణ బోర్డు అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ‘వాటర్ ఇయర్’కల్లా ఈ పరికరాలను అమర్చాలని కేంద్ర జలవనరులశాఖ, అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయం జరిగినప్పటికీ ఆ ప్రకారం ఇప్పటికీ ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి రాకపోవడంపై కేంద్రానికి, కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. మే నెలాఖరు వరకు రెండు రాష్ట్రాలూ ఏ మేరకు నీటిని వియోగించుకోవాలో కృష్ణా బోర్డు సమావేశంలో స్పష్టమైన నిర్ణయం జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తాగునీటి కోసం ఇంకా డిమాండ్ చేయనున్నట్లు తెలిసింది.నాగార్జునసాగర్‌లో ఇప్పుడు ఉన్న నీటిలో కొం తైనా వాడుకోవాలన్న ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి కంటే ఎక్కువే వినియోగించుకుంది. కానీ తెలంగాణ వాటా మాత్రం వినియోగించుకోవాల్సి ఉంది.హైదరాబాద్ తాగునీటి కోసం ఎఎంఆర్‌పి పథకం ద్వారా తీసుకోవాల్సిన నీరు నాగార్జునసాగర్ జలాశయంలో ఉంది. మే నెలాఖరు వరకు 510 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహించాలని గతంలో నిర్ణయించినా, అంత కంటే దిగువకు వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. కనీస నీటిమట్టం నిర్వహించి, తాగునీటి అవసరాలు తీర్చుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వ యోచన.


నీటి వాడకాలపై తేలని లెక్కలు

అయితే ఆంధ్రాకు నీరివ్వడానికి 510 అడుగుల కంటే లోతులకు వెళితే ఇబ్బందని, గతంలో శ్రీశైలం నుంచి 1 టిఎంసి నీళ్లు వదలమంటే, వదలకుండా ఒకటిన్నర నెలలు ఇబ్బంది పెట్టిన వైనాన్ని తెలంగాణవాదులు ప్రస్తావిస్తున్నారు.ఈ అంశంపై సమీక్ష జరిపి మళ్ళీ నిర్ణయం తీసుకోడానికి మే నెలాఖరులో కృష్ణాబోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నెలాఖరులో వీలున్న సమయాన్ని చెప్పాలని ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు, ఇరిగేషన్ శాఖలకు బోర్డు సమాచారాన్ని చేరవేసింది. రెండు రాష్ట్రాలకూ ఒక అంగీకారం కుదిరితే నెలాఖరులో సమావేశం ఉంటుంది. లేదా కొత్త ‘వాటర్ ఇయర్’ ప్రారంభమైన తర్వాత జూన్ రెండో వారంలో సమావేశం ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టెలీమెట్రీ వ్యవస్థలోని తొలి, రెండవ, మూడవ దశల స్థితి, బచావత్ అవార్డు మేరకు 20 శాతం తాగునీటినే పరిగణనలోకి తీసుకోవడం, పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువగా మళ్లించిన నీరు, సాగర్ ఎడమ కాలువలో నష్టాలు, టెలీమెట్రీ క్యాలిబరేషన్, వర్కింగ్ మాన్యువల్, వచ్చే సంవత్సరంలో నీటి వాటాల ఖరారు, ఇప్పటివరకు వినియోగించిన నీటి లెక్కలు, బోర్డుకు అదనపు అధికారులు, అదనపు అధికారాలు తదితర అంశాలపై కూడా చర్చించేలా రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు సమాచారం చేరవేసినట్లు తెలిసింది. కేంద్ర జలవనరుల శాఖ, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన పాయింట్లలో టెలిమెట్రీ పరికరాలను నెలకొల్పినప్పటికీ వాటిలోని డాటా సరిగ్గా లేకపోవడం, తెలంగాణ ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అదనపు టెలిమెట్రీ పరికరాలను నెలకల్పడానికి కొత్త పాయింట్లను ఖరారు చేయడంలో ఆ రాష్ట్రం చేస్తున్న జాప్యం, ఆ రాష్ట్ర నీటి వినియోగం లెక్కల్లో వస్తున్న తేడాలు తదితరాలపై గత కొంతకాలంగా కృష్ణాబోర్డులో పరిశీలన జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అదనపు నీటి వినియోగంపైనా, టెలిమెట్రీ పరికరాల తప్పుడు లెక్కలపైనా తెలంగాణ ప్రభుత్వం కృష్ణాబోర్డునే వేలెత్తి చూపుతోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఉన్న ఏర్పాటు చేసిన టెలిమెట్రీ పరికరాల్లోని లోపాలను, మర్మాన్ని తేల్చడానికి రెండు రాష్ట్రాల సంయుక్త టీంలు సర్వేను ఇప్పటికే మొదలుపెట్టాయి. మరో పది, పదిహేను రోజుల్లో సర్వే ఫలితాలు వస్తాయి. దీంతో శ్రీశైలం రిజర్వాయర్లో నీటిమట్టం, పోతిరెడ్డిపాడు గేజ్‌లు చూపే మట్టాల్లో తేడాలు ఉంటే స్పష్టంగా బయటపడుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments:

Post a Comment