Breaking News

18/05/2019

అందుబాటులోకి వచ్చిన ధరణి

హైద్రాబాద్, మే 18, (way2newstv.in)
భూ సమస్యలకు తావులేకుండా పారదర్శకంగా సేవలు అందేలా ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చేసింది. భూ రికార్డులకు సంబంధించి ప్రస్తుతం మా భూమి వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. దీనిలో భూములకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంది.ఆధునీకరణను జోడించి ధరణి పేరుతో కొత్త వెబ్‌సైట్ రూపొందించారు. రిజిస్ట్రేషన్లు పూరైన వెంటనే క్రయవిక్రయదారుల వివరాలను వెంటనే రికార్డుల్లో నమోదు చేసేలా ధరణి వెబ్‌సైట్‌ను ప్రభుత్వం రూపొందించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న మాభూమి స్థానంలో సమగ్ర సమాచారంతో ఈ వెబ్‌సైట్ రూపొందించారు. రెవెన్యూ, వ్యవసాయ, నీటి పారుదల, సహకార, బ్యాంకింగ్ శాఖలకు చెందిన అధికారులకు వెబ్‌సైట్ తెరిచే అవకాశం ఉంటుంది. ధరణి వెబ్‌సైట్ సేవలు  రాష్ట్రంలోని 30 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి రానుంది. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి. ఇంతకు ముందు సేవలు ఇంగ్లిషులోనే ఉండగా ఇకనుంచి ధరణిలో తెలుగుకు పూర్తిస్థాయిలో అవకాశం కల్పించారు. ధరణి వెబ్‌సైట్ నిర్వహణలో బాధ్యులైన మండల స్థాయి అధికారులు, సిబ్బందికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. 


అందుబాటులోకి వచ్చిన ధరణి

హైదరాబాద్‌లో 30 జిల్లాల పరిధిలోని ధరణి కంప్యూటర్ నిర్వాహకులకు నిర్విహించిన శిక్షణ కార్యక్రమంలో వెబ్‌సైట్ ప్రత్యేకాధికారి రజత్‌కుమార్ పలు సూచనలు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది పరిష్కారించాల్సిన దస్తాలు, వాటి పురోగతి ఎప్పటికప్పుడు తహసీల్దార్ కంప్యూటర్‌లో కనిపిస్తుంటుందని.. కాలయాపన చేస్తే చర్యలు తీసుకునే సర్వ అధికారాలు తహసీల్దార్లకు కల్పిస్తుందని పేర్కొన్నారు.రైతులు వన్-బీ ఖాతా నెంబర్ చెపితే చాలు సమగ్ర వివరాలు సబంధిత అధికారులు తెలుసుకోని దీంతో రైతులు రుణాలతో పాటు ఇతర సేవలు సులువుగా పొందవచ్చు. నిజాం కాలం నుంచి ఆధునీకరణకు నోచుకోని భూరికార్డులను ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా తప్పులు లేకుండా సరిచేసిన రికార్డుల డిజిటలైజేషన్ చేస్తుంది. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధరణి వెబ్‌సైట్ ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భూమితో సంబంధం ఉండే ప్రభుత్వ శాఖలన్నింటికి చోటు కల్పిస్తున్నారు. రైతులకు అన్ని సేవలు సులువుగా అందేలా ఈ వెబ్‌సైట్ ఉపయోగపడనుంది.భూ రికార్డుల్లో మార్పు చేయాలంటే గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారి వరకు ధ్రువీకరించాల్సి ఉంటుంది. పారదర్శకత కోసం అన్ని స్థాయిల అధికారులకు బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. అన్‌లైన్‌లోకి ప్రవేశించాలంటే సంబంధిత అధికారి వేలిముద్రను ఉంచితేనే కంప్యూటర్ ప్రవేశానికి అనుమతి ఇస్తుంది. దీంతో ఇతరులు ఎవరూ మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. భూ రికార్డుల నిర్వహణకు వినియోగిస్తున్న మా భూమి వెబ్‌సైట్ ప్రవేశం కేవలం రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉండేది. ఇందులో రికార్డుల్లో పేరు మార్పిడి మాత్రమే నిర్వహించేవారు. దీనికి భిన్నంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ధరణి వెబ్‌సైట్‌లో భూములతో సంబంధం ఉన్న రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, సహకార, బ్యాంకింగ్ శాఖలకు మాత్రమే ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నారు. బ్యాం కుల్లో రుణం కావాలంటే రైతులు వీఆర్వో నుంచి ఆర్డీవో వరకు తిరిగి రికార్డులు తీసుకుని రావాల్సి ఉండేది. దీంతో పాటు తమ వద్ద ఉన్న పాసుపుస్తకాలను బ్యాం క్‌ల్లో తనఖా పెట్టాల్సి వచ్చేది. అప్పుడే రైతన్నలకు రుణం మంజూరు అయ్యేది. ఇకముందు రైతన్న తన దగ్గర ఉన్న వన్-బీ ఖాతా నంబర్ చెపితే చాలు అందరి అధికారుల నుంచి వివరణ తీసుకుని వెంటనే రుణాలు మంజూరు చేసేలా సిద్ధ్దం చేస్తున్నారు. 

No comments:

Post a Comment