Breaking News

23/05/2019

ముగ్గురితో విజయ్ బ్రేకప్


హైద్రాబాద్, మే 23 (way2newstv.in)
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సౌత్‌ సినిమాలో ప్రస్తుతం క్రేజీ కథానాయకుడు. ఈయనకు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ అభిమానులు ఉన్నారు. అందుకే, ఆయన సినిమాలను ఇప్పుడు నాలుగు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మధ్యనే ప్రారంభమైన ‘హీరో’ను సైతం నాలుగు భాషల్లో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు మధ్యలో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ నటిస్తున్నారు. 


ముగ్గురితో విజయ్ బ్రేకప్
‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఉంగరాల రాంబాబు’, ‘ఓనమాలు’ వంటి మంచి సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్.. ఈ కొత్త సినిమాలో విజయ్‌ని విఫల ప్రేమికుడిగా చూపించబోతున్నారట. ప్రేమించిన ప్రతి అమ్మాయితో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సమాచారం. అందుకే, దీనికి ‘బ్రేకప్’ అనే టైటల్‌ను ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, ఇజాబెల్లె లైట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరి ముగ్గరితో సినిమాలో విజయ్‌కు బ్రేకప్ అయిపోతుందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఇప్పటి వరకు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే వచ్చారు. ప్రతి సినిమాకు తేడా చూపిస్తూ వస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’లో కాస్త ఎక్కువగానే రొమాన్స్ చేసిన విజయ్‌కు ఆ తరవాత ఆ స్థాయిలో అవకాశం రాలేదు. కానీ, ‘బ్రేకప్’లో మాత్రం ముగ్గురు హీరోయిన్లతో విజయ్ రొమాన్స్ చేసేస్తారట. క్రాంతి మాధవ్ ఈ లవ్ స్టోరీలను కాస్త కొత్తగా చూపించబోతున్నారని సమాచారం. 

No comments:

Post a Comment