Breaking News

23/05/2019

63 స్కూళ్లలో జీరో రిజల్స్


గాంధీనగర్, మే 23 (way2newstv.in)
ఒక స్కూల్లో ఒకరో ఇద్దరో పరీక్షలు పాస్ కాలేదంటే అనుకోవచ్చు. కానీ, 63 స్కూళ్లలో ఏ ఒక్క విద్యార్థి పాస్ మార్క్ సాధించలేదంటే.. అక్కడ చదువులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మంగళవారం గుజరాత్ సెకండరీ, హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ 10వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మొత్తం పాస్ పర్సంటేజ్ 66.97 మాత్రమే. 


63  స్కూళ్లలో జీరో రిజల్స్
గతేడాదిలో లభించిన 67.5 శాతం కంటే తక్కువ మంది ఈ ఏడాది పాసయ్యారు. బోర్డ్ ఛైర్మన్ ఏజే షా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరీక్షలకు 8,22,823 మంది హాజరు కాగా.. కేవలం 5,51,023 మంది మాత్రమే పాసైనట్లు తెలిపారు. 63 పాఠశాలల్లో కనీసం ఒక్క విద్యార్థి కూడా పాస్ మార్క్ తెచ్చుకోలేదన్నారు. బాలికలు 72.64 శాతం మంది పాస్ కాగా, బాలురు 62.83 శాతం పాసయ్యారని తెలిపారు. కేవలం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో మాత్రమే పాస్ పర్సంటేజ్ మెరుగ్గా ఉందన్నారు. ఇంగ్లీష్ మీడియంలో 88.11 శాతం, హిందీలో 72.66 శాతం, గుజరాతీ మీడియంలో 64.58 శాతం పాసయ్యారని తెలిపారు. 

No comments:

Post a Comment