Breaking News

07/05/2019

అడ్డూ, అదుపు లేకుండా ఇటుక బట్టీలు

నిజామాబాద్, మే 7, (way2newstv.in
ఇటుక బట్టీల వ్యాపారానికి అంతులేకుండా పోతోంది. అనుమతులు ఉండవు. ల్లాలో ఇటుక బట్టీల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం అక్రమార్కులకు కలిసివస్తోంది. నిబంధనల ప్రకారం పలు శాఖల అనుమతుల మేరకే వీటిని నిర్వహించాల్సి ఉండగా వ్యాపారులు నిబంధనలకు గాలికొదిలేస్తున్నారు. లాభసాటి వ్యాపారం కావడంతో ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లాగా అక్రమంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో అందరి దృష్టి ఈ వ్యాపారంపై పడింది. 


అడ్డూ, అదుపు లేకుండా ఇటుక బట్టీలు

తలమడుగు మండలం రుయ్యాడి శివారు ప్రాంతంలోని ఇటుకబట్టీ. ఏజెన్సీలో వీటి నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవు. వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా రైతులను మచ్చిక చేసుకొని కొంత డబ్బును ముట్టజెప్పి పొలాన్ని లీజు రూపంలో తీసుకుని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు.పన్ను చెల్లింపులు అసలే ఉండవు. అధికారుల పట్టింపులు అంతకన్నా ఉండవు. దీని వల్ల ప్రభుత్వానికి అందవలసిన ఆదాయానికి గండిపడుతుంది. అధికారులకు అందినంత అందడంతో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనితో జిన్నారం, గుమ్మడిదల మండలంలో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా సాగుతుంది. వ్యవసాయంకు ఇచ్చే ఉచిత విద్యుత్ కూడ ఇటుక బట్టిలకు వాడుకుంటున్నారు.సిరులు కురిపించాల్సిన పొలాలు ఇటుక బట్టీలకు నిలయంగా మారి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి.

No comments:

Post a Comment