Breaking News

28/05/2019

మూడు ఏబీలు చంద్రబాబు ముంచేశారు...


విజయవాడ మే 27 (way2newstv.in)

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 సీట్లలోనే విజయం సాధించింది. అయితే చంద్రబాబు మూడు ఏబీలపై పెట్టుకున్న విశ్వాసం దెబ్బతీయడమే టీడీపీ ఓటమికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎన్నికల్లో తాను మరోసారి గెలవడానికి మూడే ఏబీలు బాగా పనికొస్తాయని భావించారు. అయితే అవికాస్తా వికటించి కొంప ముంచాయి. ఇంతకీ ఆ మూడు ఏబీలు ఏంటన్నదేగా మీ డౌట్‌. వస్తున్నాం... అక్కడకే వస్తున్నాం... ఏబీలు అంటే చంద్రబాబు పాలనలో పనిచేసి అధికారులు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్టీజీ ఈసీవో అహ్మద్‌బాబు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు. వీరిని ముగ్గురిని కలిపి చంద్రబాబు త్రి ఏబీలుగా పిలుచుకునేవారు.  వీరు ముగ్గురు ఏదో సాయం చేస్తారని చంద్రబాబు నమ్మితే.. వారు మాత్రం నిండా ముంచేశారు.మొదటి ఏబీగా చెప్పుకునే ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు తన విధులు సక్రమంగా నిర్వర్తించలేదు. 


మూడు ఏబీలు చంద్రబాబు ముంచేశారు...

చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా ఉంటూ... రూట్‌ లెవెల్లో జరుగుతున్న వైఫల్యాలను చంద్రబాబు దృష్టికి తీసుకురాలేదు. పాదయాత్రలో జగన్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, మంత్రులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతోన్న ప్రజా వ్యతిరేకతలాంటి అనేక అంశాలను ఏబీ వెంకటేశ్వరరావు గుర్తించలేకపోయారు. ఇంటెలిజెన్స్‌ నిఘా వైఫల్యంతో చంద్రబాబు దారుణ ఓటమిని చవిచూశారన్న ప్రచారం సాగుతోంది.  రెండో ఏబీగా చెప్పుకునే ఆర్టీజీ సీఈవో అహ్మద్‌బాబు... ప్రభుత్వ పథకాలపై ప్రజల సంతృప్తి శాతంను పీక్‌లో చంద్రబాబుకు చూపించారు. ప్రభుత్వ పథకాలు అందని వారికి, ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉన్నవారికి కూడా ఫోన్‌ చేసి సంతృప్తిశాతం తెలుసుకొనే ప్రయత్నం చేశారు.  అన్నీ తప్పుడు సర్వేలు చేసి చంద్రబాబు సంతృప్తి శాతాన్ని వందశాతం చేసి, ఆయనను సున్నాకు దించేశారు. ఆర్టీజీని నమ్ముకొన్న చంద్రబాబు... రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను రియల్‌గా చూపించలేకపోయారు. ఇక మూడవ ఏబీ అయిన... అశోక్‌బాబు... ఎన్జీవోల  నాయకునిగా మెరుపులు మెరిపిస్తాడని, కాపు సామాజిక ఓట్లను రాబడతాడని చంద్రబాబు ఎంతో ఆశతో అశోక్‌బాబును ఎమ్మెల్సీ చేశారు. తీరా చూస్తే... ఉద్యోగుల ఓట్లు టీడీపీకి వ్యతిరేకంగా పడ్డాయి.  ఇక కాపు సామాజిక ఓట్లు గ్లాస్‌కు పడ్డాయి. చంద్రబాబుకు మాటలు చెప్పిన అశోక్‌బాబు... చేతల్లో మాత్రం వాటిని నిరూపించలేకపోయారు. ముగ్గురు ఏబీలు చంద్రబాబుకు దగ్గరగా ఉంటూ... నాయకా అంటూ వీరతాళ్లు వేస్తూ వచ్చారు. వీరతాల్లను చూసి మురిసిపోయిన చంద్రబాబు.. అవే తనకు బంధనాలు అవుతాయని ఊహించలేకపోయారు. ఇలా చంద్రబాబు ఓటమికి మూడు ఏబీలు కారణమనే చర్చ సర్వత్రా జరుగుతోంది. 

No comments:

Post a Comment