Breaking News

07/05/2019

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టార్గెట్ గా బాబు

విజయవాడ, మే 7, (way2newstv.in)
రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు రోజుకో వివాదాన్ని మోసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల కోడ్ ఉన్న‌ప్ప‌టికీ త‌న మాటే నెగ్గాల‌ని, త‌న పంత‌మే నెగ్గాల‌ని భావిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని టార్గెట్ చేసుకున్నారు. అయితే, ఇప్పుడు ఏకంగా ఆయ‌న ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిని కూడా ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌ల బాణాల‌ను సంధిస్తున్న‌ారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రు త‌న‌ను ఆప‌లేర‌ని, అంద‌రూ త‌న‌కు లోబ‌డి ఉండాల‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తున్నారు. ప్రతి ఒక్క‌రూ ముఖ్యంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌న‌కు ప్ర‌తి విష‌యాన్ని చెప్పి వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న అన్నారు.చంద్ర‌బాబు చేసిన ఈ వ్యాఖ్య‌లు అటు ఉన్న‌తాధి వ‌ర్గాల్లోను, ఇటు ప్ర‌జ‌ల్లోనూ కూడా తీవ్ర సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌భు త్వం అనేది ఒక బానిస సంస్థ కాదు! ప్ర‌భుత్యం అంటే.. ప్ర‌జ‌ల‌తో ఎన్నుకోబ‌డిన ప్ర‌తినిధులు, ఉన్న‌తాధికారుల స‌మాహా రం. ప్రజ‌ల‌చేత ఎన్నుకోబ‌డిన నాయ‌కుల‌కు స‌మాచారం అందించే బాధ్య‌త‌, వారికి సూచ‌న‌లు ఇచ్చే సంస్కృతి కూడా అధికారుల్లో ఉంది. అనేక స‌మ‌స్య‌ల‌కు నాయ‌కులు ప‌రిష్కారం చూపించ‌ని సంద‌ర్భాల్లో ఉన్న‌తాధికారులే స్వ‌యంగా రంగంలోకి దిగి.. వాటికి ప‌రిష్కారాలు చూపించిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. 


 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  టార్గెట్ గా బాబు

ముఖ్యంగా ప్ర‌భుత్వ పాల‌న అంటే.. క్షేత్ర‌స్థాయిలో ఉండే ప్ర‌తి ఉద్యోగినీ క‌లుపుకొంటూ పోతూ.. ప్ర‌జ‌ల‌కు సేవ అందించ‌డ‌మే.అయితే, ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు స‌మీక్ష‌ల‌కు ఎన్నిక‌ల కోడ్ అడ్డంకిగా మారింది. ఇక‌, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం నేరుగా ఏ విష‌యాన్న‌యినా ఎన్నిక‌ల సంఘానికి నివేది స్తున్నారు. స‌మీక్ష‌లు, చంద్ర‌బాబు చేస్తున్న కార్య‌క్ర‌మాల వివ‌రాల‌నుఏ రోజుకారోజు ఢిల్లీకి చేర‌వేస్తున్నారు. నిజానికి ఎన్నిక‌ల కోడ్ అమల్లో ఉన్న స‌మయంలో ఏ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయినా కూడా ఇలాగే చేస్తారు. కానీ, చంద్ర‌బాబు ఇలా చేయ‌డాన్ని మ‌హాప‌రాధంగా భావిస్తున్నారు. ప్ర‌భుత్వానికి పెద్ద‌న‌యిన నేను ఇంకా సీఎంగా ఉన్న‌ప్పుడే.. ఇలా చేయ‌డమేంటి? నాక‌న్నా ఎన్నిక‌ల సంఘ‌మే ఎక్కువా అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.ప్ర‌తి విష‌యాన్నీ త‌న‌కు చెప్పిన త‌ర్వాతే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదేశాలు జారీచేయాల‌ని ఆయ‌న అంటున్నారు. అయితే, చంద్ర‌బాబు ఇలా నియంతృత్వ పోక‌డ‌ల‌తో వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ఉన్న‌తాధికారులు కూడా స‌హించ‌లేక పోతున్నారు. ఎల్వీ ఎలాంటి త‌ప్పు చేయ‌డం లేద‌ని అంటున్నారు. కోడ్ అమ‌ల్లో ఉండ‌గా, ఎన్నిక‌ల సంఘ‌మే సుప్రీం అని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఏ ప్ర‌భుత్వ‌మైనా.. అధికారుల‌ను బానిస‌గా చూడ‌జాల‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధులుగా ఉంటున్న అధికారులు.. ఇటు సీఎం ఆదేశాలు క్షేత్ర‌స్థాయిలో అమ‌ల్యేలా చూడ‌డం, అటు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం విధిగా పెట్టుకుంటార‌ని అంటున్నారు. మొత్తానికి చంద్ర‌బాబు వైఖ‌రి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా ఉంద‌ని అంటున్నారు.

No comments:

Post a Comment