Breaking News

16/05/2019

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు

వనపర్తి,  మే 16  (way2newstv.in)
పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికిచెందినవిలేఖరి  బాలస్వామి  అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాదులోని యశోద ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. మండల పార్టీ అధ్యక్షులు మెగా రెడ్డి గత రెండు రోజుల క్రితం  హైదరాబాదులో ఆస్పత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు, 


మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు

ఆరోగ్య పరిస్థితి గురించి  మంత్రికి వివరించడంతో  మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సీఎం సహాయనిధి నుండి రూ,, 1 లక్ష రూపాయలను మంజూరు చేయిస్తూ  గురువారం హైదరాబాదులో బాలస్వామి కుటుంబ సభ్యులకు సదరు పత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారికి, మంత్రి సహాయంతో ఎల్ వో సి మంజూరుకోసం కృషిచేసిన మండల పార్టీ అధ్యక్షులు మేఘ రెడ్డి గారికి బాలస్వామి కుటుంబ సభ్యులైన సంతోష్ కుమార్, కృష్ణవేణి, అశోక్, బాలయ్య, చంద్రయ్య, రాజు, భాను తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment