తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి పర్యటన ఖారారైంది. ఆదివారం కేసీఆర్ తిరుపతి వెళ్తారని సీఎం కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువరించారు. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామికి కేసీఆర్ మొక్కు చెల్లించేందుకు తిరుమల వెళ్లిన విషయం తెలిసిందే.
ఆదివారం తిరుపతికి కేసీఆర్
ఆయన స్వామివారిని దర్శించుకుని బంగారు ఆభరణాలను సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు ఆభరణాలను సమర్పిస్తానని మొక్కుకున్న కేసీఆర్.. రూ.5 కోట్లతో బంగార ఆభరణాలు తయారు చేయించారు. కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు, కొందరు మంత్రులు కలిసి రెండు ప్రత్యేక విమానాల్లో తిరుపతి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.
No comments:
Post a Comment