Breaking News

23/05/2019

పాల్లలో డిటెర్జెంట్ కలుపుతున్నారోచ్


లక్నో, మే 23 (way2newstv.in)
మీరు పాలు తాగేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు తాగేది పాల కాక్ టైల్ కావచ్చు,తెల్ల పెయింట్ కావచ్చు లేదా డిటర్జంట్ కూడా కావచ్చు.సమ్మర్ కావడంతో దేశంలో పాల కొరత మొదలైన విషయం తెలిసిందే.సమ్మర్ మొదలైన నాటి నుంచి ఇతర అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కన్నా పాలు,దాని సంబంధిత ప్రొడక్ట్ ఎక్కువగా  అనారోగ్యానికి గురి చేసే విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అనేక డైరీ ప్లాంట్ లలో అధికారులు రైడ్స్ చేసిన సమయంలో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.డిటర్జెంట్,యూరియా,అనేక రకాల కెమికల్స్ ను పాలలో కలిపి వాటిని స్వేచ్ఛగా ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటున్న తీరుని చూసి అధికారులు షాక్ అయ్యారు.


పాల్లలో డిటెర్జెంట్ కలుపుతున్నారోచ్
వారణాశిలోని ఓ పెద్ద డైరీ ప్లాంట్ లో యూపీ ఫుడ్ డిపార్ట్ మెంట్ రైడ్స్ నిర్వహించి డిటర్జెంట్ కలిపిన 10వేల లీటర్లకు పైగా కృత్రిమ పాలను సీజ్ చేశారు.ఈ డైరీని కాశీ సన్యాగ్ బ్రాండ్ పేరుతో ప్యూర్ డైరీ సొల్యూషన్ రన్ చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అధికారులు ఇదే విధంగా కెమికల్స్ కలిపిన కృత్రిమ పాలను సీజ్ చేయడం జరిగిందని ఫుడ్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.ఉత్తరప్రదేశ్,హర్యానా,పంజాబ్ లో స్థానికులు నిర్వహిస్తున్న అనేక డైరీ ప్లాంట్ లు సమ్మర్ లో డిటర్జెంట్ లు కలిపిన పాలను యధేచ్చగా అమ్ముతున్నాయని తెలిపారు.ఢిల్లీలో కూడా ఢిల్లీ ఫుడ్ సేప్టీ డిపార్ట్ మెంట్(DFSD) మెజార్టీ మిల్క్ శాంపిల్స్ ను టెస్ట్ చేసినప్పుడు అవి తాగడానికి పనికిరానివిగా తేలింది. 2018 జనవరి నుంచి 2019 ఏప్రిల్ మధ్యలో 477 శాంపిల్స్ ను గవర్నమెంట్ ల్యాబ్ లలో టెస్ట్ చేసినప్పుడు అవి తాగడానికి పనికిరానివిగా తేలినట్లు  అధికారులు ఓ రిపోర్ట్ లో తెలిపారు.కొన్ని రోజుల క్రితం యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యుడు మోహన్ సింగ్ అహ్లువాలియా  మాట్లాడుతూ...దేశంలో అమ్ముడవుతున్న  68.7శాతం పాలు,దాని సంబంధిత ప్రొడక్ట్ లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) రూపొందించిన ప్రమాణాలను పాటించడం లేదని తెలిపారు.డిటర్జెంట్స్,కాస్టిక్ సోడా,గ్లూకోజ్,వైట్ పెయింట్,రిఫైన్డ్ ఆయిల్ వంటివి కామన్ గా కల్తీ పాల ఉత్పత్తుల్లో వాడుతున్నారని అహ్లువాలియా తెలిపారు

No comments:

Post a Comment