Breaking News

23/05/2019

13 లక్షల చిల్లర నాణెలతో కారు కోనుగోలు


బీజింగ్, మే 23 (way2newstv.in)
చైనాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. చైనా హెబీయి ప్రావిన్స్ లోని కాంగ్ ఝౌ నగరంలో ఓ మహిళ ఫోక్స్ వాగన్ కార్ల షోరూంకు ఏకంగా 66 బస్తాల చిల్లర నాణేలతో వచ్చి అక్కడి సిబ్బందికి నిజంగానే అగ్నిపరీక్ష పెట్టింది. ఆ మహిళ ఫోక్స్ వాగన్ పసాట్ మోడల్ కారు కొనుక్కోవాలని వచ్చింది. అయితే చెక్కులు, నోట్లకు బదులు నాణేలు తీసుకురావడంతో అవి లెక్కించేందుకు షోరూం సిబ్బందికి తల ప్రాణం తోకకు వచ్చింది. 


13 లక్షల చిల్లర నాణెలతో కారు కోనుగోలు
ఏకంగా 17 మంది సిబ్బంది ఆ 66 బస్తాల్లోని నాణేలు లెక్కించేందుకు మూడు రోజుల సమయం పట్టింది.ఆ మహిళ కూడా అన్నేసి బస్తాలను మూడు విడతల్లో తీసుకువచ్చింది. అది మొదలు సిబ్బంది షోరూంలో నేలపై కూర్చుని లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టారు. కొందరు నాణేలను యువాన్లు, జియావోలుగా విభజన చేస్తుంటే, మరికొందరు వాటిని కుదురుగా పేర్చుతూ ఎట్టకేలకు మూడ్రోజులకు లెక్కింపు పూర్తిచేశారు. ఇంతకీ ఆమె తెచ్చింది 1,30,000 యువాన్లు (భారత కరెన్సీలో రూ.13 లక్షలు)

No comments:

Post a Comment