Breaking News

23/05/2019

బెంగళూర్ లో సైబర్ ఎటాక్


బెంగళూర్, మే 23 (way2newstv.in)
బర్ ఎటాక్.. ఈ పేరు వింటనే ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఇండియాలోని పలు రాష్ట్రాలు, నగరాలు గజగజ వణికిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ ఎప్పుడు.. ఎలా.. ఎక్కడి నుంచి ఎటాక్ చేస్తారో తెలియదు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, నగరాలు సైబర్ పరంగా రిస్క్ ఎదుర్కొంటున్నాయని ఓ అధ్యయనం చెబుతోంది. 2018లో సైబర్ ఎటాక్స్ అత్యధికంగా ఎదుర్కొన్న నగరాల్లో బెంగళూరు టాప్ లో నిలిచినట్టు క్విక్ హీల్ రిపోర్ట్ వెల్లడించింది. రిపోర్ట్ ప్రకారం.. బెంగళూరుతో పాటు సైబర్ ఎటాక్స్ ఎదుర్కొన్న నగరాల్లో ముంబై, ఢిల్లీ/నేషనల్ క్యాపిటల్ రీజియన్, కోల్ కతా కూడా ఈ హిట్ లిస్టులో ఉన్నట్టు నివేదిక తెలిపింది. ‘బెంగళూరు.. దేశంలో టెక్నికల్ హబ్ గా ఎంతో పాపులర్ ఉన్న సిటీ. ఐటీ జాబ్స్ కు పుట్టినిల్లు కూడా. అందుకే సైబర్ క్రిమినల్స్ ఈ నగరాన్నే టార్గెట్ చేస్తున్నారు’ అని క్విక్ హీల్ వ్యవస్థాపకుడు సంజయ్ కట్కర్ చెప్పారు. ఈ కంపెనీలన్నీ ప్రత్యేకమైన టెక్నాలజీ వాడుతున్నప్పటికీ సైబర్ క్రిమినల్స్ వీటినే టాప్ టార్గెట్ చేసేందుకు కొత్త మార్గాలను అన్వేస్తున్నట్టు నివేదిక చెబుతోంది.


బెంగళూర్ లో సైబర్ ఎటాక్
క్రిప్టో జాకింగ్.. ఒక వ్యక్తి కంప్యూటర్ ను అనుమతి లేకుండా మరొకరి కంట్రోల్లోకి తీసుకోవడం.. క్రిప్టోకరెన్సీ.. దీని స్థానంలో రాన్సమ్ వేర్.. వినియోగదారులు, ఎంటర్ ప్రైజ్ లకు నెంబర్ వన్ థ్రెట్ గా మారింది. రాన్సమ్ వేర్ అనేది.. మాల్ వేర్ తో నిండి ఉంటుంది. ఇది యూజర్ ఫైళ్లు, డివైజ్ లను లాక్ చేస్తుంది. ఆన్ లైన్ పేమెంట్స్ ను పేరు లేకుండా రీస్టోర్ యాక్సస్ ను నిమిషానికి 14సార్లు రిపోర్ట్ చేస్తుందని క్విక్ హీల్ నివేదిక గుర్తించింది. రాన్సమ్ వేర్ మాల్ వేర్ సిగ్నల్స్  పెరిగే అవకాశం ఉందని, మొబైల్ డివైజ్ లకు ముప్పు మాత్రమే కాకుండా క్రిప్టో జాకింగ్ కూడా భారీగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది.2018 ఏడాదిలో విండోస్ డివైజ్ లపై 973 మిలియన్ల మాల్ వేర్ ఎటాక్స్ ఆందోళన కలిగించగా.. ఇప్పటికీ వినియోగదారులే లక్ష్యంగా ఎటాక్స్ కొనసాగుతున్నట్టు తెలిపింది. నిమిషానికి 1900 మాల్ వేర్లను గుర్తించినట్టు పేర్కొంది. సంబంధిత ఆండ్రాయిడ్ డివైజ్ ల్లో కొద్దిపాటి ముప్పును ఎదుర్కొన్నట్టు అధ్యయనం తెలిపింది. సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా కంప్రైజడ్ వెబ్ సైట్లపైనే లక్ష్యంగా చేసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. అయినప్పటికీ కంప్రమైజడ్ వెబ్ సైట్లను గుర్తించడం అంత సులభం కాదని, బ్రౌజర్ వార్నింగ్ ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేస్తుందని కట్కార్ చెప్పారు. సైబర్ క్రిమినల్స్.. మాల్ వేర్ ను సర్వీసుగా, రాన్సమ్ వేర్ సర్వీసుగా అమ్మేస్తున్నారు. సైబర్ క్రైంలపై అవగాహన ఇంకా తక్కువ స్థాయిలో ఉండటమే ఆందోళన కలిగిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరాలను తక్కువగా ఉన్నప్పుడే కఠినమైన సైబర్ చట్టాలను తీసుకరావాల్సిన అవసరం ఉందని నిపుణులు తెలిపారు

No comments:

Post a Comment