ఎన్నికల్లో గెలిచిన నామా నాగేశ్వరరావు కు కాంగ్రెస్ అభ్యర్ధిని రేణుకా చైదరీ అభినందనలు తెలియచేసారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసేందుకు బాధ్యత తీసుకోవాలని ఆమె సూచించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం లో నైతిక విలువలు బతికే ఉన్నాయని ప్రజలు నిరూపించారు. నాకు మద్దతుగా నిలిచిన 4 లక్షల మంది ఓటర్లకు కృతజ్ఞతలు.
చేదు నిజాలు
లోక్ సభ స్థానంలో ఎమ్మెల్యే లు లేకున్నా కార్యకర్తలు తెరాస పై పోరాడారు. దేశంలో కాంగ్రెస్ ఓటమికి నాయకత్వం బాధ్యత వహించాలని అన్నారు. తోటి మహిళ గా కవిత ఓడిపోవడం బాధాకరం. కేంద్రంలో కేసీఆర్ అవసరం భాజపా కు అవసరం లేదు. నైతికంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు రావడంపై సీఎల్పీ నేత భట్టి ని అడగాలని ఆమె అన్నారు. నేను చెప్పే చేదు నిజాలు కొందరికి నచ్చక పోవచ్చు. కానీ నేతలు మేల్కొంటేనే మళ్లీ కాంగ్రెస్ పూర్వ వైభవం వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచన చేయాల్సిందని అన్నారు.
No comments:
Post a Comment