Breaking News

22/05/2019

జూన్ 8,9 తేదీల్లో చేప మందు పంపిణీ

హైదరాబాద్ మే 22 (way2newstv.in)

ప్రతి ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని జూన్ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్‌గౌడ్‌ తెలిపారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 8వ తేదీ ఉదయం హైదరాబాద్‌ దూద్‌బౌలిలోని తమ బత్తిన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, అనంతరం చేప మందు ప్రసాదాన్ని తయారు చేసి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కి తరలిస్తామన్నారు.ఈ ఏడాది చేప మందుకోసం సుమారు 5-6 లక్షల మంది వచ్చే అవకాశం ఉందన్నారు. 

జూన్ 8,9 తేదీల్లో చేప మందు పంపిణీ

కర్ణాటక, మహారాష్ట్రలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు సైతం ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.చేప మందును 8, 9 తేదీల్లో పంపిణీ చేస్తామని అన్నారు. చేప మందు పంపిణీ సక్రమంగా జరగటానికి హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌తోపాటు వాటర్‌ వర్క్స్, జీహెచ్‌ఎంసీ, పోలీస్, మత్స్య శాఖల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. చేప మందు పంపిణీకి 250 మంది వాలంటీర్లను ఏర్పాటు చేస్తున్నామని బత్తిన కుటుంబ సభ్యులు తెలిపారు. చేప మందు పంపిణీ కోసం ఈ నెల 28వ తేదీన కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులతో సమావేశం అవుతామని, అనంతరం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.ఆస్తమా రోగులకు బత్తిన సోదరులు మూడు రకాల మందును పంపిణీ చేస్తుంటారు. మాంసాహారుల కోసం చేప ప్రసాదం, శాఖాహారుల కోసం బెల్లం ప్రసాదం, ఇంట్లో వేసుకునేందుకు వీలుగా కార్తె ప్రసాదం అనే మూడు రకాల ప్రసాదాలను బత్తిని సోదరులు అందిస్తున్నారు...

No comments:

Post a Comment