Breaking News

22/05/2019

నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం

నెల్లూరు మే 22 (way2newstv.in)

పీఎస్‌ఎల్వీ-సీ46 ప్రయోగానికి సన్నద్ధమవుతున్న వేళ నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం రేపింది.నెల్లూరు తీరంలో శ్రీలంక  రిజిస్ట్రేషన్‌తో కూడిన పడవను గుర్తించారు.కృష్ణపట్నం పోర్టు, షార్‌కు అత్యంత సమీపంలో పడవ లభించింది.దీనితో ఉగ్రవాదులు చొరబడ్డారన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

నెల్లూరులో ఉగ్రవాదుల కలకలం

అత్యంత కీలక స్థావరాలైన షార్‌, కృష్ణపట్నం పోర్టులను టార్గెట్ చేశారా?తూర్పు తీరంలోని రక్షణ స్థావరాలపై గురి పెట్టారని అనుమానం వ్యక్తమవుతుంది.బోటులో యమహా ఇంజిన్‌, అయిదు లీటర్ల ఖాళీ వాటర్ బాటిల్ ,  రెండు 20 లీటర్ల  క్యాన్లు, ఒక బెడ్‌షీటు లభ్యమైనాయి.ముందు జాగ్రత్తగా రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

No comments:

Post a Comment