Breaking News

25/04/2019

నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి డిమాండ్
జగిత్యాల ఏప్రిల్ 25 (way2newstv.in)  
ఇంటర్ మీడియట్ విద్యార్థులు మరణానికి ముఖ్య మంత్రి భాద్యుడని, అందుకు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసారు. 


నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి

ముఖ్యమంత్రి కేటీఆర్ సేవలో ఇంటర్ బోర్డు నడుస్తుందని జీవన్‌రెడ్డి ఆరోపించారు విద్యార్థుల ప్రాణాలంటే ముఖ్యమంత్రికి లెక్కలేదా అని ఆయన ప్రశ్నించారు. అసలుముఖ్యమంత్రి కేసీఆర్‌కు నైతికత ఉందా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతటి దారుణమైన విద్యావ్యవస్థ దేశంలోనే లేదని విమర్శించారు. గ్లోబరినాపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దిగిపోతేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

No comments:

Post a Comment