Breaking News

25/04/2019

ప్రజల భద్రత కోసమే కార్దన్ సర్చ్

నిర్మల్, ఏప్రిల్ 25 (way2newstv.in)  
గురువారం నాడు నిర్మల్ పట్టణ పోలీసు  పరిధిలోని గాజులపేట్ లో  పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ తనీఖీల్లో ఎలాంటి దృవీకరణ పత్రాలు లేని 82 ద్వీచక్ర వాహనాలతో పాటు ఇరవై ఆటో రిక్షాలు, రెండు కార్లు,  ఒక ఇసుక ట్రాక్టర్, రూ 2,000 విలువైన గుట్క, మూడు  ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఈ  సందర్భంగా జిల్లా ఎస్పీ  శశిధర్ రాజు కాలనీ ప్రజలతో మాట్లాడుతూ శాంతి భద్రతలపై ప్రజలకు భరోసా కల్పించడంతో పాటు, నేరాల నియంత్రణ, నిందితుల గుర్తించడం కోసం ఈ కార్దన్ సర్చ్ నిర్వహించామని అన్నారు. 


ప్రజల భద్రత కోసమే కార్దన్ సర్చ్ 

పట్టణ, గ్రామాల పరిధిలో నిరంతరం  నిఘా కోసం బ్లూ కోల్ట్స్ , పెట్రో కార్ బృందాలను ప్రారంభించడం జరిగింది. ఈ బృందాల ద్వారా ప్రజల భద్రత కోసం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు నేరస్తుల కదలికపై నిఘా కొనసాగించడం జరుతుందని అయన అన్నారు. పటిష్టమైన నేర నివారణ చర్యలలో భాగంగా కాలనీ వసూలు అందరూ కలిసి కాలనీలోని ముఖ్య కూడలిల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అత్యవసర సమయములో   100 నెంబర్ కు గాని, సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారము అంధించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు.  హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దు, నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. 

No comments:

Post a Comment