విశాఖపట్టణం, ఏప్రిల్ 10 (way2newstv.in)
చంద్రబాబు ఏ సమీకరణలు చూసుకుని సిట్టింగులకు మళ్ళీ సీట్లు ఇచ్చారో తెలియదు కానీ తనకంటే గొప్పోళ్ళు ఎవరూ లేరని టీడీపీ సిట్టింగు ఎమ్మెల్యేలు ఇపుడు తెగ ధీమా ప్రదర్శిస్తున్నారు. తాము అపుడే ఎమ్మెల్యేలుగా గెలిచేసినట్లేనని కూడా వారు ఫీల్ అయిపోతున్నారట. ప్రచారం కూడా చేశాంలే అన్నట్లుగానే ఉంటోంది తప్ప గట్టిగా చేయడంలేదని తమ్ముళ్ళే అంటున్నారు. ఇంతకీ విశాఖ జిల్లా సిట్టింగులకు ఈ అతి విశ్వాసం పెరగడం వెనక కారణాలు ఏంటన్నవి చూస్తే బొలెడు కనిపిస్తాయి.విశాఖ అర్బన్ జిల్లా విషయానికి వస్తే పక్కనున్న భీమిలీ నుంచి తీసుకువచ్చి చివరి నిముషంలో వైసీపీ అక్రమాని విజయనిర్మలకు టికెట్ ఇచ్చింది. దాంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, రెండు సార్లు గెలిచిన వెలగపూడికి ధీమా పెరిగిందట.
సిట్టింగ్ లలో పెరిగిన కాన్ఫిడెన్స్
ఇక విశాఖ సౌత్ లో కూడా రాత్రికి రాత్రే వచ్చి చేరిన ద్రోణం రాజు శ్రీనివాస్ కి టికెట్ వైసీపీ ఇచ్చింది. దాంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచేశాననే అనుకుంటున్నారుట. ఇక విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు అజేయుడు అన్న పేరు ఉంది. ఆయనకు అక్కడ పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్ధి కేకే రాజు కానీ, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కానీ పోటీ కాదంటున్నారు.విశాఖ పశ్చిమలో కూడా టీడీపీ అభ్యర్ధి గణబాబు తన అభివృధ్ధి పనులే గెలిపిస్తాయని చెబుతున్నారు. తాను గెలిచి చూపిస్తానని సవాల్ కూడా చేస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నారు. ఇక చోడవరం ఎమ్మెల్యే రాజు గారు కూడా తనకు వైసీపీ అభ్యర్ధి కరణం ధర్మశ్రీ పోటీ కాదని అంటున్నారు. ఇలా సిట్టింగులు కడు ధీమాతో ముందుకు పోతున్నారు. బాగానే ఉంది కానీ ఇక్కడ వైసీపీ అభ్యర్ధులు మొదట్లో తడబడినా ఇపుడు బాగానే పుంజుకుంటున్నారు. మరో వైపు వైసీపీ గాలి ఉంది. అదే కనుక ప్రభంజనం గా వీస్తే అపుడు పార్టీ అభ్యర్ధి ఎవరన్నది కూడా చూడకుండా ఓటేస్తారు. అలా ఓడిపోయిన మహామహులు చరిత్రలో ఎంతో మంది కనిపిస్తారు. ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ తమ్ముళ్ళు తమని కాస్తా పట్టించుకోవాలని సిట్టింగులను కోరుతున్నారు.
No comments:
Post a Comment