Breaking News

10/04/2019

హామీల అమలే లక్ష్యంగా దాడులు

విజయవాడ, ఏప్రిల్ 10 (way2newstv.in)
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా కనిపించేది రైతు రుణమాఫీ హామీ. చంద్రబాబు నాయుడు ఈ హామీ ఇవ్వగా వైఎస్ జగన్ మాత్రం తన వల్ల కాదని, ఈ హామీ ఇవ్వలేనని ఖరాఖండిగా చెప్పేశారు. పార్టీ నేతలు పలువురు సైతం రైతు రుణమాఫీ హామీ ఇవ్వాలంటూ జగన్ కు సూచించినా వినలేదు. రాష్ట్రం ఉన్న పరిస్థితిలో రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు. ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి విడతల వారీగా చేస్తున్నారు. ఈ డబ్బులో ఎక్కువ మొత్తం వడ్డీలకే పోతుందనే వాదనలు ఉన్నా రుణమాఫీ చేశామనే పేరు మాత్రం తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. ఇదే హామీ జగన్ ఇచ్చి ఉంటే గత ఎన్నికల్లో పరిస్థితి ఇంకోలా ఉండేదని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు. ఇక, ఈ ఎన్నికల్లోనూ జగన్ ఇదే వైఖరి అవలంభిస్తున్నట్లు కనిపిస్తోంది.ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అన్నింటినీ కచ్చితంగా అమలు చేయాలని జగన్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏడాదిన్నర క్రితం ఆయన ప్రకటించిన నవరత్నాలు, ఇటీవలి మేనిఫెస్టో పరిశీలిస్తే ఇదే అర్థమవుతోంది. మనసా, వాచా, కర్మానా మెనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలనూ అమలు చేస్తానని జగన్ ప్రకటించారు. 


హామీల అమలే లక్ష్యంగా దాడులు

తాను అధికారంలోకి వస్తే మేనిఫెస్టో అమలుపై ప్రతీరోజూ రివ్యూ చేస్తానని, 2024 ఎన్నికల్లో ఈ మేనిఫెస్టో మొత్తం అమలు చేశాకే ప్రజాతీర్పు కోరతానని ప్రకటించారు. అధికారంలోకి రావడానికి వందల హామీలు ఇచ్చి తర్వాత ‘కండీషన్స్ అప్లై’ అని చెప్పే నేతల వైఖరికి జగన్ వైఖరి విరుద్ధం. తాను అధికారంలోకి వచ్చాక చేయగలిగే హామీలను జగన్ ఇస్తున్నారు. ఇందుకు ముఖ్యంగా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన రెండు పథకాలను ఉదాహరణగా తీసుకోవచ్చు.వాస్తవానికి ఏడాదిన్నర క్రితమే జగన్ తాను అధికారంలోకి వస్తే రూ.2,000 పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఎన్నికల వేళ ఈ హామీని చంద్రబాబు అమలు చేసేసి తన ఖాతాలో వేశారు. ఈ విషయాన్నీ జగన్ ముందే చెప్పారు. ఒకవేళ చంద్రబాబు 2,000 ఎన్నికల ముందు ఇస్తే తాను3,000 ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు రూ.3,000 పింఛన్ అని జగన్ హామీ ఇచ్చారు. అయితే, ఇది వెంటనే కాకుండా 3,000కు పెంచుకుంటూ పోతానని జగన్ చెబుతున్నారు. అంటూ అధికారంలోకి రాగానే 3,000 ఇవ్వనని, క్రమంగా పెంచుకుంటూ వెళతాననేది జగన్ హామీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆయన ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఇక, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెబుతున్న జగన్ ముందుగానే నాలుగు విడతల్లో అని చెప్పేస్తున్నారు. అన్ని ప్రచార సభల్లోనూ ఈ విషయం చెబుతున్నారు. మిగతా వారిలా ‘విడతల్లో’ అని చెప్పకుండా కేవలం రుణమాఫీ అని చెబితే సరిపోయేది. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని అనేది జగన్ భావనలా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిని పూర్తిగా అంచనా వేసి అమలు చేయగలిగే హామీలనే జగన్ ఇస్తున్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపే పరమావధిగా అయితే ఆయన హామీలు లేవు.

No comments:

Post a Comment