Breaking News

10/04/2019

గంటాపై ముప్పేట దాడి

విశాఖపట్టణం, ఏప్రిల్ 10 (way2newstv.in)
రాష్ట్రంలో హాట్ ఫైట్ జరిగే స్థానాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఒకటి…మామూలుగా అయితే ఈ నియోజకవర్గం గురించి పెద్ద చర్చ జరిగే అవకాశం ఉండేది కాదు. కానీ విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండటంతో…అందరి దృష్టి ఈ స్థానంపై పడింది. పైగా రాష్ట్రంలో ఎక్కడ పోటీ ఇవ్వలేని బీజేపీ పార్టీ ఇక్కడ గట్టి పోటీ ఇస్తుంది. ఈ పోటీ ఇవ్వడానికి కారణం విష్ణుకుమార్ రాజు. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా విష్ణు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇక ఈసారి కూడా ఆయనే మళ్ళీ బరిలో ఉన్నారు.అటు గత ఎన్నికల్లో టీడీపీ తరుపున భీమిలి నుంచి గెలుపొంది మంత్రిగా చేసిన గంటా…ఈసారి ఉత్తరం బరిలో దిగడంతో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. గంటాకీ జిల్లాలో అన్నీ స్థానాల్లో పట్టు ఉండటం వల్లే…ప్రతిసారి ఆయన నియోజకవర్గాలు మారుస్తూ పోటీ చేస్తుంటారు. ఈ సారి కూడా అదే చేశారు. పైగా నగర ప్రాంతం కావడంతో గంటాకి మరింత కలిసిరానుంది. ఇక్కడ గంటాకి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీ కేడర్ కూడా బలంగా ఉంది. ఇక టీడీపీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు బోనస్. అయితే మాటిమాటికి నియోజకవర్గాలు మారుస్తూ ఉండటం, విశాఖ చాలా భూకబ్జాల్లో గంటా పాత్ర కూడా ఉందని ఆరోపణలు రావడం మైనస్ అయ్యే అవకాశం ఉంది.ఇక విష్ణు పార్టీ ఇమేజ్ కంటే వ్యక్తిగత ఇమేజ్‌తోనే నెట్టుకు రావాల్సిన పరిస్తితి. రాష్ట్రంలో బీజేపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది తప్ప విష్ణుకి నియోజకవర్గంలో మంచి పేరే ఉంది.


గంటాపై ముప్పేట దాడి

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను ప్రజలకి అందించారు. అలాగే బీజేపీ, టీడీపీ మిత్రబంధం కొనసాగిన సమయంలో తెలుగుదేశంపై విమర్శలు చేయడం, అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించేందుకు సాధారణ ప్రజలకు సహకరించడం లాంటివి చేయడం వలన విష్ణు పట్ల నియోజకవర్గ ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారు. అయితే బీజేపీ పార్టీలో కాకుండా వేరే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విష్ణుకి కొంత గెలిచే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనే చెప్పాలి.వైసీపీ అభ్యర్ధిగా కన్నపరాజు (కెకె.రాజు) పోటీ చేస్తున్నారు. కన్నపరాజు ఈ నియోజకవర్గంలోనే ఉండటం వలన.. ఇక్కడ ఉన్న ప్రతి సమస్యపై ఆయనకి అవగాహన ఉంది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన ఆయ‌న ఇక్క‌డ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స్థిర‌ప‌డ‌డంతో పాటు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో రాణించి యేడాది క్రితం వైసీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అలాగే ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతూ…పార్టీని బలోపేతం చేశారు. పార్టీ ప్రకటించిన నవరత్నాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. అయితే గంటా లాంటి సీనియర్ అభ్యర్దిని ఢీకొనడం కష్టమైన విషయమనే చెప్పాలి. అటు ఆవిర్భావం వైసీపీలో ఉన్న పసుపులేటి ఉషా కిరణ్ టికెట్ దక్కపోవడంతో జనసేనలో చేరి … ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఉషా కిరణ్‌కి ఇక్కడ కొంత ఫాలోయింగ్ ఉంది. అలాగే కాపు ఓటింగ్ కూడా ఎక్కువ ఉండటం ఉషాకి కలిసొచ్చే అంశం.ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరు సుమారు 70 వేల మంది వరకు ఉన్నారు. ఆ తర్వాత 45 వేలు మందితో వెలమలు ఉన్నారు. ఇక వీరి తర్వాత యాదవులు, క్షత్రియులు, ముస్లింలు ఉన్నారు. ఇక టీడీపీ, జనసేన అభ్యర్ధులు కాపు సామాజికవర్గం కాగా, బీజేపీ, వైసీపీ అభ్యర్ధులు క్షత్రియులు. దీని బట్టి కాపు, క్షత్రియ ఓటర్లు ఎక్కువ ఎటువైపు ఉంటారనేది అర్ధమైపోతుంది. దీంతో మిగిలిన సామాజికవర్గాలు అభ్యర్ధుల గెలుపోటములని ప్రభావితం చేయొచ్చు. ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే గంటాకే ఎడ్జ్ కనపడుతుంది. అయితే చతుర్మఖ పోటీ జరుగుతుండటంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. మరి ఇది ఎవరికి ప్లస్ అవుతుందో ఎవరికి మైనస్ అవుతుందో ఎన్నికల్లో తెలియాల్సిందే. అదే టైంలో క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన విష్ణుకుమార్ రాజు, కెకె.రాజు ఒక్క‌ట‌య్యార‌ని… విష్ణు కుమార్ సైతం ప‌రోక్షంగా తాను ఓడినా గంటా గెల‌వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో కెకె.రాజుకు స‌పోర్ట్ చేస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది.

No comments:

Post a Comment