విజయవాడ, ఏప్రిల్ 4 (way2newstv.in)
లోకేష్ గెలవాలి….ఓటమి అనేది ఉండకూడదు. ఇదీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు. ఎన్నికల్లో పోటీ చేయని అగ్రనేతలందరికీ చంద్రబాబు ఆదేశాలివే. యనమల రామకృష్ణుడు, తొండెపు దశరధ జనార్థన్ వంటి నేతలను మంగళగిరిపై కాన్ సంట్రేషన్ చేయాలని ఆదేశించారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తుండటంతో మంగళగిరి రాష్ట్రంలోనే ఈఎన్నికల్లో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.నారాలోకేష్ తన అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే మంగళగిరిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేయకముందే అక్కడ ఉన్న అసంతృప్త నేతలను కలసి తనకు సహకరించాల్సిందిగా కోరారు. తొలి రోజుల్లో రోడ్ షోలు, సభలకు పరిమితమైన లోకేష్ తర్వాత ప్రచార తీరును మార్చుకోవాల్సి వచ్చింది. రోడ్ షోలకు, సభలకు జనం పెద్దగా రాలేదు. దీంతో ఆయన కాలినడకన కొద్దిరోజుల నుంచి ప్రచారానికి దిగారు. కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే మంగళగిరిని 18 నెలల్లోనే అభివృద్ధి చేస్తానని చెప్పుకొస్తున్నారు.
లోకేష్ కోసం టీడీపీ అగ్రనేతలు
మంగళగిరిలో అత్యధికంగా ఉండే చేనేత సామాజిక వర్గం ఎటు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చేనేత సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. అయితే తమ సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వకపోవడం, లోకేష్ మంగళగిరిలో గెలిస్తే కుప్పం తరహాలోనే వారి కుటుంబం సొంతమవుతుందని ఆ సామాజిక వర్గం నేతలు భయపడుతున్నారు.తమకు ఎన్నటికీ అవకాశం రాదని భావిస్తున్నారు. దీంతో ఎన్నికల నాటికి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి కరంగా మారింది.మరోవైపు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి బలమైననేత. గత ఎన్నికల్లో 12 ఓట్ల తేడాతో గెలిచినప్పటికీ ఈ ఐదేళ్లలో తన సొంత నిధులతో ప్రజలను ఆకట్టుకునే పథకాలను అమలు చేశారు. నాలుగు రూపాయలకే భోజనం, పది రూపాయలకే కూరగాయల వంటి విన్నూత్న పథకాలతో ఆళ్ల ముందుకెళుతున్నారు. ఇవన్నీ పసిగట్టిన చంద్రబాబు మంగళగిరిలో ఎలాంటి తేడా రాకుండా చూడాలని నేతలకు నిత్యం క్లాస్ పీకుతున్నారు. ఎప్పటికప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో డెవలెప్ మెంట్స్ పై నివేదికలు తెప్పించుకుంటున్నారు. పొరపాటున కూకట్ పల్లిలా ఫలితం ఉంటే పరువు పోతుందని బాబు భయపడిపోతున్నారు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాలుగా తనయుడి విజయం కోసం కృషి చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో…
No comments:
Post a Comment