విజయవాడ, ఏప్రిల్ 5, (way2newstv.in)
ఆంధ్రప్రదేశ్ లో అధికారం అప్పగిస్తే తాను ఏం చేస్తానో వైసీపీ అధినేత జగన్ వివరించారు. వైసీపీ అధికారంలోకి వస్తే టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలన అందిస్తామని జగన్ తెలిపారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాల ఫలాలను ప్రతీ గడపకు చేరుస్తామని హామీ ఇచ్చారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తామని పేర్కొన్నారు.
ఏపీని స్వర్ణాంధ్రగా మారుస్తాం
ఇదే తన విజన్ అని జగన్ వ్యాఖ్యానించారుఈరోజు జగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘టెక్నాలజీ ఆధారంగా పారదర్శక పాలన అందిస్తాం, అవినీతి లేకుండా ప్రభుత్వ వికేంద్రీకరణ చేపడతాం. సంక్షేమ ఫలాలను గడపగడపకూ అందిస్తాం. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారుస్తాం. అంధ్రప్రదేశ్ పై నాకున్న విజన్ ఇదే’ అని జగన్ ట్వీట్ చేశారు
No comments:
Post a Comment