అనంతపురం, ఏప్రిల్ 5, (way2newstv.in)
వేసవి ఓ వైపు నీటి సమస్య తీవ్రతరం చేస్తుంటే పట్టణంలో కాస్తోకూస్తో జనానికి స్వాంతన చేకూర్చుతున్న ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు మూతదిశగా కొనసాగుతున్నాయి. టిడిపి మెనిఫెస్టోలో పేర్కొన్నట్లు రూ.2కే 20 లీటర్ల శుద్ధజల పంపిణీ చేసే పథకాన్ని ప్రయోగాత్మకంగా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. రెండేళ్ల క్రితమే అన్నిహంగులతో పట్టణంలో ఐదు ప్లాంట్‌లను ఏర్పాటు చేశారు. తర్వాత మరో రెండు ప్లాంట్‌లను ప్రారంభించారు. అయితే వివిధ కారణాలతో మూడు ప్లాంట్లు మూతబడ్డాయి. మరో రెండు ప్లాంట్లు అడపాదడపా నడిపిస్తున్నారు. కేవలం రెండు ప్లాంట్లు మాత్రమే కొంతవరకు జనానికి ఉపయోగకరంగా నడుస్తున్నాయి.
ఐదింటిలో మూడు మూత పడ్డ సుజల ప్లాంట్స్
పట్టణంలోని శ్రీకంఠపురంలో ఏర్పాటు చేసిన రెండు ప్లాంట్లు నీళ్లు లేక మూసివేశారు. హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన మరో ప్లాంట్లు మూతపడింది. ప్రస్తుతం హౌసింగ్ బోర్డులో ఉన్న రెండు ప్లాంట్, కొట్నూరులోని శుద్ధజల ప్లాంట్ అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి. కేవలం ముద్దిరెడ్డిపల్లి, చిన్నమార్కెట్ సర్కిల్‌లోని శుద్ధ జల ప్లాంట్లు మాత్రమే జనానికి కొంతవరకు నీటిని అందించగలుగుతున్నాయి. వీటి కోసం ఉదయం నుండే జనం క్యూ కడుతున్నారు. వార్డుకు ఒకటి శుద్ధ జల ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని పాలకులు జోరుగా వాగ్ధానాలు చేసినా ఆ తర్వాత పట్టించుకోలేదు. దీనికితోడు శుద్ధ జల ప్లాంట్‌లను ఏర్పాటు చేసిన నిర్వాహకులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను తీర్చడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు. పట్టణంలో నీటి సమస్య తీవ్రతరం కావడంతో ప్లాంట్‌లకు అవస
No comments:
Post a Comment