Breaking News

05/04/2019

పవన్ ఒక ప్రశ్నగా మిగిలిపోయారు

విజయవాడ, ఏప్రిల్ 5, (way2newstv.in)
ప్రశ్నిస్తానన్న పవన్‌.. తానే ఓ ప్రశ్నగా మిగిలారంటున్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. పవన్ డబుల్ గేమ్ ఆడుతున్నారు.. ఏపీలో సంక్లిష్టమైన పరిస్థితులకు పవన్ కళ్యాణే కారణమన్నారు. 2014లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేద్దాం అంటే ఒప్పుకోని పవన్‌.. టీడీపీ మద్దతు పలికారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓ పథకం ప్రకారమే పవన్‌ టీడీపీపై విమర్శలు చేస్తున్నారని.. కొందరికి కొమ్ముకాసే వ్యక్తిగా మిగిలిపోతారన్నారు.చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం మరో 40 ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు సోము. 


పవన్ ఒక ప్రశ్నగా మిగిలిపోయారు

కేంద్రం ఏపీకి రూ. 6 లక్షల కోట్లు ఇస్తే ఆ నిధులన్నీ మింగేశారని.. ఎక్కడిక్కడ ఇసుక తవ్వి రూ.40 వేల కోట్లు దోచేశారని ఆరోపించారు. అందుకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ఇసుక దందాపై రూ. 100 కోట్లు జరిమానా విధించిందన్నారు. రాజధాని నిర్మించకుండా గ్రాఫిక్స్‌ మాయాజాలంతో చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఏపీని అధోగతి పాలు చేస్తారని ధ్వజమెత్తారు.ఆర్‌ఎస్‌ఎస్‌ నేత మోహన్‌భగవత్‌ను కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు వీర్రాజు. రాష్ట్రం నుంచి ఎవరినైనా బహిష్కరించాల్సి వస్తే.. ముందుగా చంద్రబాబునే బహిష్కరించాలన్నారు. వ్యవస్థలన్నింటీ మేనేజ్‌ చేయగల ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు.. తాము‌ నిజంగా టార్గెట్ చేయాలనుకుంటే ఓటుకు నోటు కేసు చాలన్నారు. 

No comments:

Post a Comment