Breaking News

10/04/2019

మరోసారి సత్తా చాటేందుకు పవన్ ప్రయత్నాలు

గ్యాంగ్ టక్, ఏప్రిల్ 10  (way2newstv.in)
పవన్ కుమార్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ మళ్లీ సత్తా చాటేందుకు శక్తియుక్తులు ధారపోస్తోంది. మొత్తం 32 స్థానాలకు గాను 2014 ఎన్నికల్లో 23 స్థానాలను గెలుచుకుంది. 1994 నుంచి ఈ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. బీజేపీ నేతృత్వంలోని ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి లో ఎస్.డి.ఎఫ్ భాగస్వామి. అయినప్పటికీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. సార్వత్రిక కనీస ఆదాయాన్ని ఎన్నికల ప్రణాళికలో ప్రవేశపెట్టింది. బీజేపీ ,కాంగ్రెస్ పాత్ర రాష్ట్రంలో నామమాత్రమే.దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలే ఎక్కువగా అధికారంలో ఉంటాయి. అప్పుడప్పుడు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా మొత్తం మీద చూస్తే జాతీయ పార్టీ ప్రభుత్వాలదే మెజారిటీ. సిక్కిం దీనికి పూర్తిగా మినహాయింపు. 1975లో ఈ రాష్ట్రం భారత్‌లో విలీనమైనప్పటి నుంచి ఇంత వరకు ఇక్కడ ఏ జాతీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలే మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకున్నాయి. 1979, అక్టోబర్‌లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో నర్‌బహదూర్‌ భండారీ నాయకత్వంలోని సిక్కిం జనతా పరిషత్‌ (ఎస్‌జేపీ) 31 సీట్లకుగాను 16 సీట్లలో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో రెండు ప్రాంతీయ పార్టీలు సిక్కిం కాంగ్రెస్‌ (రివల్యూషనరీ)11, సిక్కిం ప్రజాతంత్ర కాంగ్రెస్‌ 4 సీట్లు గెలుచుకున్నాయి. 


మరోసారి సత్తా చాటేందుకు పవన్ ప్రయత్నాలు

తర్వాత ఎస్‌జేపీ కాంగ్రెస్‌లో విలీనమైంది. కొంత కాలం తర్వాత భండారీ బయటకొచ్చేసి సిక్కిం సంగ్రామ్‌ పరిషత్‌ (ఎస్‌ఎస్‌పీ) పేరుతో ప్రాంతీయ పార్టీ పెట్టారు.మరో వైపు బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాము బీజేపీతో పొత్తును విరమించుకుంటున్నట్లు ‘ది సిక్కిం క్రాంతికారీ మోర్చా’ ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లనున్నట్లు స్పష్టం చేసింది.లోక్‌సభ ఎన్నికలతో పాటే సిక్కిం అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. సిక్కిం అసెంబ్లీలో మొత్తం 32 నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎస్‌కేఎమ్ అభ్యర్థుల్ని నిలబెట్టనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి సోనమ్ భూటియా తెలిపారు.మొత్తం నియోజకవర్గాల్లో మా పార్టీ తరపున అభ్యర్థుల్ని నెలబెడతాం. ఎవరితో పొత్తుకు వెళ్లమని కుండ బద్దలు కొట్టారు.ఎన్నికలు సమీపించిన నేపధ్యంలో బీజేపీకి ఇలా పొత్తు భంగం కలగడం సిక్కింలో భారీగా నష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఇది చిన్న రాష్ట్రమే అయినప్పటికీ ఈ ప్రభావం వేరే రాష్ట్రాల్లో ఉంటే బీజేపీ పెద్ద ఎత్తున ఓట్లు కోల్పోవాల్సి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఏకంగా సిక్కిం డెమొక్రాటిక్ పార్టీ 30 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1989 ఎన్నికల్లో భండారీ పార్టీ మొత్తం 32 స్థానాలను గెలుచుకుంది. 1990లో ఎస్‌జేపీ నేత పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ భండారీపై తిరుగుబాటు చేశారు. సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1994 ఎన్నికల్లో ఆ పార్టీ 19 సీట్లు గెలుచుకుని గద్దెనెక్కింది. 1999 ఎన్నికల్లో 24 సీట్లతో ఎస్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ఎస్‌ఎస్‌పీ ప్రధాన ప్రతిపక్షమైంది. 2004, 2009, 2014 ఎన్నికల్లో కూడా చామ్లింగ్‌ పార్టీ ఘన విజయం సాధించి ఐదుసార్లు వరసగా అధికారం చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించింది. ఈసారి అసెంబ్లీకి, లోక్‌సభ(ఒకటే సీటు)కు కలిసి ఏప్రిల్‌ 11న ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 371(ఎఫ్‌) అధికరణం సిక్కిం ప్రజల ప్రత్యేక హక్కుల పరిరక్షణకు హామీ ఇస్తోంది. తమ హక్కులను ప్రాంతీయ పార్టీలే పరిరక్షించగలవన్న గట్టి నమ్మకం ప్రజల్లో పాతుకుపోయిందని, జాతీయ పార్టీలను వేటినీ వారు నమ్మరని, అందుకే వారు జాతీయ పార్టీలను ఆదరించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment