Breaking News

01/04/2019

మోడీపై జవాన్ పోటీ

లక్నో, ఏప్రిల్ 1, (way2newstv.in)
రెండేళ్ల కిందటబోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో జవాన్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తేజ్ బహదూర్ చర్యలకు ఆయనను ఉద్యోగం నుంచి తప్పించగా, తాజాగా మరోసారి అతడు వార్తల్లో నిలిచాడు. ఈసారి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీకి దిగుతానని సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం మోదీ బరిలో ఉన్న వారణాసి నియోజకవర్గం నుంచే తాను కూడా పోటీ చేయనున్నట్లు తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ వెల్లడించాడు. హరియాణాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్‌ ప్రధాని మోదీపై పోటీకి సై అన్నాడు. ఎన్నికల్లో పోటీచేస్తున్నాని చెప్పగానే పలు రాజకీయ పార్టీలు తనను సంప్రదించాయని, అయితే నేను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. భద్రతా దళాలల్లో అవినీతి గురించి మాట్లాడేందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బహదూర్‌ తెలిపారు. 


మోడీపై జవాన్ పోటీ

ఎన్నికల్లో గెలుపోటములు కాదు.. భద్రతా బలగాలు ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బరిలోకి దిగుతున్నా. జవాన్ల పేరు చెప్పి ఓట్లు పొందడానికి మోదీ యత్నిస్తున్నారు. కానీ జవాన్ల కోసం ఆయన ప్రభుత్వం చేసిందేమీలేదు. పుల్వామా దాడిలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోతే కనీసం వారికి అమరుల హోదా కూడా ఇవ్వలేదు’ అని బహదూర్‌ ఆరోపించారు. త్వరలోనే తాను వారణాసిలో మాజీ సైనికోద్యోగులు, రైతులు సహకారంతో ప్రచారం ప్రారంభిస్తానని, వీలైనంత మంది ఎక్కువ మంది ఓటర్లను కలుసుకోవడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ జవాన్లకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా తేజ్ బహదూర్ ఆరోపణలు చేయడంతో క్రమశిక్షణా చర్యల కింద ఆయనను విధుల నుంచి తొలగించారు. దీంతో బహదూర్‌ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. క్రమశిక్షణ ఉల్లంఘనల చర్యల కింద తనను విధుల నుంచి తొలగించడాన్ని తప్పుబట్టారు.

No comments:

Post a Comment