Breaking News

20/04/2019

16 నెలలు నుంచి కాగితాల్లోనే ఉమ్టా సూచనలు

హైద్రాబాద్, ఏప్రిల్ 20, (way2newstv.in)
హైదరాబాద్ నగరంలో రోజూ ఆర్టీసీ బస్సుల్లో 33 లక్షలు, ఎంఎంటీఎస్‌లో 1.50 లక్షలు, మెట్రో రైళ్లలో 2.30 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో సుమారు 6 లక్షల మంది ప్రయాణికులు ఆర్‌టీసీ, ఎంఎంటీఎస్ పాసులు వినియోగిస్తున్నారు. ఉమ్మడి పాస్ అందుబాటులోకి తీసుకొస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నా ఉమ్మడి పాస్‌పై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ప్రజా రవాణాలో ఉమ్మడి పాస్ అందుబాటులోకి తీసుకురావాలని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ  (ఉమ్టా) సూచించినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మెట్రో, ఆర్‌టీసీ, ఎంఎంటీఎస్ అధికారులు ఉమ్మడి పాస్ విధానంపై గతంలో నాలుగు సార్లు ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించినా ఉమ్మడి పాస్ విధానంపై ఎటూ తేల్చలేకపోయారు.మెట్రో స్టేషన్ల నుంచి ఆర్‌టీసీ బస్టాప్‌ల అనుసంధానం పూర్తి స్థాయిలో జరగక పోవడంతో ప్రయాణికులు రెట్టింపు చార్జీలు చెల్లిస్తూ ప్రైవేట్ వాహనాల్లో వెళ్తూ అవస్థలు పడుతున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఉమ్మడి పాస్‌లు అందుబాటులోకి రాకపోవడంతో మాస్ ట్రాన్స్‌ఫోర్ట్ విధానం పెరగడం లేదు. 


 16 నెలలు నుంచి కాగితాల్లోనే ఉమ్టా సూచనలు

ఢిల్లీ, బెంగళూర్, జైపూర్‌లో వంటి నగరాల్లో మెట్రోలో డే పాస్‌లు, టూరిస్ట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో జీబీటీ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. జీబీటీ పాస్‌ల నెలవారీ  చార్జీ రూ. 800 చెల్లిస్తే ఎంఎంటీఎస్ సెకండ్ క్లాస్ బోగీలలో, ఆర్‌టీసీ ఆర్డినరీ బస్సులలో రెండింటా కలిసి ప్రయాణించే సదుపాయం ఈ పాస్‌లతో కల్పిస్తున్నారు.ప్రజా రవాణాలో కీలకమైన మెట్రో, ఆర్‌టీసీ, ఎంఎంటీఎస్‌లో ఉమ్మడి పాస్ అందుబాటులోకి తీసుకొస్తే మూడింట ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలుంటాయని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ఆర్‌టీసీ, ఎంఎంటీఎస్‌లో టికెట్ చార్జీల భారం కొంత తక్కువ, మెట్రోలో టికెట్ చార్జీల భారం ఎక్కువగా ఉండడంతో మూడింటా ప్రయాణించేందుకు ఉమ్మడి పాస్ అందుబాటులోకి తెస్తే ప్రయాణికులపై చార్జీల భారం తగ్గే అవకాశాలుంటాయి. ఉద్యోగులు, కళాశాల విద్యార్థులతో పాటు సాధారణ ప్రయాణికులు ఉమ్మడి పాస్‌లతో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలుంటాయి. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజారవాణాలో కీలక మార్పులు తీసుకొస్తే రోడ్లపై ప్రైవేట్ వాహనాల రద్దీ కూడా కొంత తగ్గించుకునే అవకాశాలు ఉంటాయని రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు.బెంగళూర్, ముంబయి వంటి నగరాల్లో ఉమ్మడి పాస్‌లు అందుబాటులో ఉండడంతో ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో జీబీటీ పాస్‌తో సెకండ్ క్లాస్‌తో పాటు ఆర్‌టీసీ ఆర్డినరీ బస్‌పాసుల్లో ప్రయాణించే సౌకర్యం ఉంది. జీబీటీ పాస్ ధర నెలకు రూ. 800 ఉంటోంది. ఎంఎంటీఎస్ సెకండ్ క్లాస్ బోగీలు, ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే సౌకర్యం ఈ పాస్‌లతో ఉంటుంది. కేవలం ఎంఎంటీఎస్ రైళ్లలో వెళ్లేందుకు నెలవారీ పాస్‌లు టిక్కెట్లు.. రెండో రకం. సెకండ్ క్లాస్‌లో.. వీటి చార్జీ కనీసం రూ.150, గరిష్టం రూ. 280 ఉంది. ఫస్‌క్లాస్ బోగీల్లో వీటి చార్జీ కనీసం రూ.510, గరిష్టం రూ.1,135 ఉంటోంది. దూరాన్ని బట్టి కనీసం.. గరిష్టం నెలవారీ సీజన్ టిక్కెట్ల చార్జీలు అందుబాటులో ఉన్నాయి.రోజు వారీ బస్‌పాస్‌లు ఎంఎంటీఎస్‌లో లేవు. దూరాన్ని బట్టి రూ. 5, రూ. 10 చొప్పున చార్జీలు అందుబాటులో ఉన్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లలో రోజూ లక్షా 50వేల మంది ప్రయాణిస్తుంటారు. ఆర్‌టీసీ బస్సుల్లో 33 లక్షలు, మెట్రోలో 2.3 లక్షలు, ఎంఎంటీఎస్‌లో 1.5 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. ఉమ్మడి పాస్ అందుబాటులోకి తెస్తే మూడింట ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. నగరంలో రోజూ ఆర్టీసీ 33 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. 33 లక్షల మందిలో 5.5 లక్షల మంది ప్రయాణికులు నెలవారీ పాస్‌లు తీసుకుంటున్నా రు. ఆర్డినరీ బస్సుల్లో డే పాస్ రూ.80, ఏసీ బస్సులలో డే పాస్ 160 ఉంది. గ్రేటర్ ఆర్‌టీసీలో మొత్తం పాస్‌లు 5.5 లక్షల మంది ప్రయాణికులలో 4.5 లక్షలకు పైగా ఆర్డినరీ బస్‌పాస్‌లు ఉన్న ప్రయాణికులు ఉంటున్నారు. ఉమ్మడి పాస్ అందుబాటులోకి తెస్తే ఈ పాస్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment