Breaking News

28/03/2019

గుక్కెడు నీటి కోసం ఆదివాసుల కష్టాలు

విశాఖపట్టణం, మార్చి 28, (way2newstv.in)
కొండకోనల్లో నివసించే ఆదివాసీలకు కష్టమొచ్చింది. ఆకులు, అలముల మధ్య బతికే గిరిపుత్రులు నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మండుటెండలకు తమ గొంతులు ఎండిపోతున్నాయని గిరిపుత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారుగుక్కెడు నీటి కోసం ఆదివాసీల చెలమల బాట.. మండు వేసవిలో నీళ్ల కోసం మైళ్ల దూరం నడక...కొండకోనల్లో నీరు తాగి అనారోగ్యం పాలవుతున్న గిరిజనం... చుక్క నీటి కోసం తూర్పు ఏజెన్సీ ప్రాంతం అల్లాడుతోంది. గుక్క తడుపుకొనేందుకు ఆదివాసీ జనం విలవిల్లాడుతున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలలో పాటు గిరిజనుల నీటి కష్టాలూ పెరుగుతున్నాయి. అనేక మంది గిరిజన మహిళలు చెట్లు పుట్టల మధ్య.. రాళ్లు రప్పల మధ్య మైళ్ల దూరం నడిచి కడివెడు నీళ్ల కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఎక్కడో సుదూర ప్రాంతాల్లోని అడవిలో చెలమల నుంచి నీరు తోడుకోవాల్సి వస్తోంది. అంతదూరం వెళ్లినా చివరికి మంచినీరు దొరక్క..  చెలమల నీళ్లు తాగి అడవి బిడ్డలు అనారోగ్యం పాలవుతున్నారు.   తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని 7 మండలాలు 120 పంచాయతీల్లో 428 మంచి నీటి పథకాలు ఉన్నా...గిరిజన గూడేల్లో ఈ పథకాలు సగానికి పైగా అలంకార ప్రాయంగా మిగిలిపోయాయి. రక్షిత మంచినీటి పథకాలు లేని 354 కాలనీల్లో 3799 చేతి పంపులుండగా అందులో సగానికి పైగా పని చేయడం లేదు. 


గుక్కెడు నీటి కోసం ఆదివాసుల కష్టాలు

దీంతో కొండవాగుల్లో చెలమలు తవ్వి తాగునీరు తెచ్చుకుంటున్న ఆదివాసీలు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. కొండకోనల్లో, రాతినేలల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో కాలువలు, చెరువులు ఎండిపోయి మూగజీవాలు సైతం తాగునీటికి అల్లాడుతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగం, చిన్నతరహా తాగునీటి ట్యాంకులు నిధులు లేక చతికిల పడ్డాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన భూపతిపాలెం, సూరంపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలో నిర్వహణా లోపంతో మనుషులకే కాదు.. కనీసం పశువులకు కూడా నీటి చుక్క దొరకని పరిస్థితి నెలకొంది.  చిన్న నీటితరహా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 394 చెరువులు, 224 చెక్‌ డ్యాంలు మరమ్మతులు లేక బోసిపోయాయి.  ప్రతిఏటా నిధులు విడుదలవుతున్నా... చెరువుల్లో పూడిక తీయడం లేదు. మరమ్మతుల కోసం కేటాయిస్తున్న నిధులను అధికారులే మింగేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వేసవి రాకుండాలే మన్యం ప్రజలు మంచినీటి సమస్యతో సతమతమవుతున్నారు. పోలవరం ముంపు మండలాలైన వీఆర్‌ పురం, కూనవరం, చింతూరు, ఎట్టపాక మండలాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడి ఆదివాసీలు ప్రతిఏటా తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. కొండకోనలు, గూడాలు, మారుమూల ప్రాంతాల్లో జీవించే గిరిపుత్రుల గొంతులెండి పోతున్నా.. వారికి సమస్యను తీర్చిన నాథలే కరువయ్యారు. అక్కడక్కడ ఉన్న కాలువలు, వాగులు ఎండిపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి రాళ్ల మధ్య నిల్వ ఉన్న నీటిని తాగి అనారోగ్యం బారిన పడుతున్నారు గిరిజనులు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ సుదూరన గల గోదారి నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. కొండల మధ్య నీటిని తోడుకోవడానికి వందల అడుగుల లోతుకు దిగాల్సి వస్తోందని గిరిపుత్రులు తమ గాధను వెలిబుచ్చుతున్నారు.  మోటార్లు మొరాయిస్తున్నా... బోర్లు పనిచేయకుండా పోయినా.. అధికారులు, పాలకులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆదివాసీలు వాపోతున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్లు దూరం నడవాల్సి వస్తోందని తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా తమకు మంచినీటిని అందించాలని, తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని తూర్పు గోదావరి ప్రాంత ఆదివాసీలు 

No comments:

Post a Comment