Breaking News

06/03/2019

తెలంగాణకు నాలుగు అవార్డులు

న్యూఢిల్లీ, మార్చి 6 (way2newstv.in)
కేంద్ర అర్బన్, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్ లో స్వచ్ఛ సర్వేక్షన్-2019 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛతలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నగరాలకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వచ్ఛ సర్వేక్షన్ పురస్కారాలు అందజేశారు. 

 
తెలంగాణకు నాలుగు అవార్డులు

తెలంగాణ రాష్ట్రం నుంచి సిద్ధిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీలకు అవార్డులు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా 4,237 పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షన్ పనితీరును కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. తెలంగాణ రాష్ర్టానికి 4 అవార్డులు దక్కాయి. తడి, పొడి చెత్త సేకరణ, తడి చెత్త నుంచి కంపోస్టు తయారీ, డీఆర్సీసీ, ఏడీఎఫ్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం అవార్డులను ప్రకటించింది.

No comments:

Post a Comment