Breaking News

09/03/2019

మాగుంట ఎఫెక్ట్ తో టీడీపీ ఆచితూచి అడుగులు

ఒంగోలు, మార్చి 9, (way2newstv.in)
నెల్లూరు పార్లమెంట్‌ నుంచి గాని, ఒంగోలు నుంచి కగాని పోటీ చేయడానికి ఇష్టం లేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ అధిష్ఠానానికి తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రభావం కావలి నియోజకవర్గంపై పడింది. కావలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బీఎంఆర్‌ నిర్ణయించుకున్నారు. అధిష్ఠానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నెల్లూరు, లేదా ఒంగోలు పార్లమెంట్‌ స్థానానికి మాగుంట శ్రీనివాసులురెడ్డిని బరిలోకి దించాలని అధిష్ఠానం ఆలోచించింది. నెల్లూరు పార్లమెంట్‌ నుంచి పోటీ చేయాలని బీఎంఆర్‌తో సహా నెల్లూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులంతా మాగుంటను కోరారు. ఒకవేళ ఆయన నెల్లూరు నుంచి ఇష్టపడకపోయినా, ఒంగోలు నుంచి పోటీకి సిద్ధపడాలని అధిష్ఠానం కోరింది. అయితే రెండు చోట్ల నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని మాగుంట అధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం.


మాగుంట ఎఫెక్ట్ తో టీడీపీ ఆచితూచి అడుగులు

వైసీపీలో చేరుతారా..? మాగుంట వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోటీకి విముఖత చూపడంతో ఆ ప్రచారాని బలం చేకూరింది. మాగుంట నిర్ణయంతో టీడీపీలో రెండు పార్లమెంట్‌ స్థానాలకు అభ్యర్థి అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఒంగోలు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులను ముందే ఊహించిన అధినాయకత్వం బీఎంఆర్‌ను ఒంగోలు నుంచి బరిలోకి దించే అవకాశాలను పరిశీలించి సిద్ధం చేసుకుంది. కొద్ది రోజులకు ముందు జరిగిన ఒంగోలు సెగ్మెంట్‌ సమీక్షలో ఎక్కువ మంది బీఎంఆర్‌ను ఎంపీ అభ్యర్థిగా పంపాలని కోరారు. మాగుంట పోటీకి విముఖత చూపడంతో బీఎంఆర్‌ను ఒంగోలుకు పంపడం పార్టీక అనివార్యం అవుతుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కావలికి ఎవరు..? ఇదే జరిగితే కావలి అభ్యర్థి ఎవరవుతారు అనే అంశం ప్రధాన చర్చగా మారింది. కావలి టీడీపీ కార్యకర్తల్లో అత్యధికులు బీఎంఆర్‌నే కోరుకొంటున్నారు. బీద కుటుంబం సైతం కావలి నియోజకవర్గాన్ని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ క్రమంలో బీఎంఆర్‌ ఒంగోలు ఎంపీగా వెళ్లాల్సి వస్తే కావలి నుంచి బీద కుటుంబం నుంచే మరెవరైనా పోటీ చేస్తారా...!? లేక కొత్త వ్యక్తి తెరపైకి వస్తారా..!? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా మాగుంట నిర్ణయం కావలి టీడీ పీలో కలకలం రేపింది. ఒకవేళ బీఎంఆర్‌ కావలి అసెంబ్లీకే పోటీ చేసే పక్షంలో ఎంపీ స్థానానికి ఇప్పటికే పరిశీలనలో ఉన్న బొమ్మిరెడ్డి, విష్ణు, మెట్టుకూరు, లేదా మరో కొత్త వ్యక్తో ఎవరో ఒకరు పార్లమెంట్‌ బరిలోకి దిగనున్నారు.

No comments:

Post a Comment