Breaking News

09/03/2019

ఆర్టీసీలో 1213 మంది ఉద్యోగుల రెగ్యులర్

విజయవాడ, మార్చి 9, (way2newstv.in)
కాంట్రాక్టు కార్మికులకు ఏపీఎస్‌ ఆర్టీసీ ముందస్తు ఉగాది కానుకను ఇచ్చింది. సంస్థలో పనిచేస్తున్న 1,213మందిని యాజమాన్యం రెగ్యులర్‌ చేసింది. మొత్తం 347మంది కండక్టర్లు, 866మంది డ్రైవర్లను రెగ్యులర్‌ చేస్తున్నట్లు పేర్కొంటూ  ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(అడ్మిన్‌) ఉత్తర్వులు విడుదల చేశారు. వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఆర్టీసీలోని కార్మిక సంఘాలు గుర్తింపు సంఘం ఈయూ నేతృత్వంలో ఫిబ్రవరిలో సమ్మెకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో ఫిట్‌మెంట్‌తో పాటు పలు సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించింది. అయితే ఆర్టీసీలో బలమైన కార్మిక సంఘమైన ఎన్‌ఎంయూ మరిన్ని సమస్యలపై సమ్మె నోటీసు ఇచ్చింది.ఇటీవల ఎన్‌ఎంయూ రాష్ట్ర నాయకులతో యాజమాన్యం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 


ఆర్టీసీలో 1213 మంది ఉద్యోగుల రెగ్యులర్

ఈనెల 15లోగా దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుకు ఎన్‌ఎంయూ రాష్ట్ర నేతలు చల్లా చంద్రయ్య, రమణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్‌ 1నుంచి కొత్త జీతాలు అందుకోవడంతో పాటు భారీ మొత్తంలో అరియర్స్‌ పొందనున్న కార్మికులకు గుర్తింపు సంఘం ఈయూ రాష్ట్ర నేతలు పలిశెట్టి దామోదర్‌రావు, వైవీ రావు శుభాకాంక్షలు తెలిపారు. వీరితోపాటు డిస్‌ ఎంగేజ్‌లో ఉన్న మరో 150మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవడానికి కూడా ఎండీ అంగీకరించారని వారు పేర్కొన్నారు. ఫలితంగా 866 మంది కండక్టర్లు, 347 మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది. ఆయా సిబ్బంది పని చేస్తున్న రీజియన్లలో తగినన్ని ఖాళీలు లేనప్పటికీ, వారిని ముందుగా రెగ్యులర్‌ చేసి ఆ తర్వాత అవసరమైన పక్షంలో ఖాళీల సంఖ్యను బట్టి ఇతర రీజియన్లలో సర్దుబాటు చేస్తారు. ఆ మేరకు సిబ్బంది నుంచి ముందే అంగీకార పత్రాలు తీసుకుంటారు. 2019 మార్చి 15వ తేదీ నుంచి వీరి ఉద్యోగాలు రెగ్యులర్‌ అవుతాయి. తాజా ఉత్తర్వులు ఫలితంగా రూ.13,700 వేతనం అందుకుంటున్న వారికి రూ.26 వేలు, రూ.12,540 వేతనం అందుకుంటున్న వారికి రూ.25 వేలు వేతనం అందనుంది. ఆర్టీసీ ఒప్పంద ఉద్యోగుల ఉద్యోగాల క్రమబద్ధీకరణ పట్ల హర్షం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment